సెక్టోరల్ అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి
పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్
00000
హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ఈనెల 30వ తేదీన జరుగనున్న సందర్భంగా సెక్టోరల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఈనెల 29న హుజురాబాద్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సిబ్బంది తో కలిసి పోలింగ్ సామాగ్రి తో పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.
గురువారం హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశా
లలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సెక్టోరల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ఓటర్లు భౌతిక దూరం పాటించేలా చూడాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వివి ప్యాట్లు సున్నితంగా ఉంటాయని వాటిని లైట్ ల కింద పెట్టకూడదని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి వెళ్లేటప్పుడు వివి ప్యాట్లాను చెక్ చేయవద్దని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో బ్యాలెట్ యూనిట్ లు, కంట్రోల్ యూనిట్లను చెక్ చేసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు ఉదయం 5:30 కు మాక్ పోలింగ్ నిర్వహించి పోలింగ్ ఏజెంట్లు సమక్షంలో వాటిని క్లియర్ చేసి సీల్ చేసుకోవాలని తెలిపారు. పీవోలు, ఏపీఓ లతో సమన్వయం చేసుకుని పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్త్ డెస్క్, హెల్ప్ డెస్క్ తప్పనిసరిగా ఉండాలని , ఇందులో ఏఎన్ఎం , ఆశ వర్కర్ ఉండేలా చూడాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే రిజర్వులో ఉన్న ఈవీఎంలను అందజేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించేలా చూడాలని అన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ ఏజెంట్లు రెండు డోసులు కోవిద్ వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు ధ్రువీకరించు గా కావాలని, కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోకుంటే అర్టిపిసిఆర్ సెంటర్ నుంచి తెచ్చిన సర్టిఫికెట్ చూసి అనుమతించాలని తెలిపారు. ఏజెంట్లు తప్పనిసరిగా ఆ పోలింగ్ కేంద్రంలో ఓటర్ ఆయి ఉండాలని తెలిపారు. పోలింగ్ ముగిసాక కంట్రోల్ యూనిట్ బటన్ క్లోజ్ చేసుకోవాలని అన్నారు. పోలింగ్ ముగిసాక ఈవీఎంలు పోలింగ్ సిబ్బంది తో కలిసి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ కు రావాలని, అక్కడ స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంలను భద్రపరచాలని సూచించారు. రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా వెళ్ళకూడదని తెలిపారు. సెక్టోరియల్ అధికారులకు మెజిస్ట్రేరియల్ పవర్స్ ఉన్నాయని, పోలింగ్ రోజు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మేజిస్టిరియల్ పవర్స్ ఉపయోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నిక శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని కలెక్టర్ సెక్టోరియల్ అధికారులకు సూచించారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్:
ఈ నెల 30న జరగనున్న హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక కు సంబంధించి హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చేసిన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఆర్ వి కర్ణన్ గురువారం పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది కోసం వేసిన టేబుల్లు, కుర్చీల అమరిక, షామియానాలు తదితర వాటిని పరిశీలించి ఇంకా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు జీవి శ్యాం ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి సి హెచ్. రవీందర్ రెడ్డి, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.