హుజురాబాద్ జూనియర్ కళాశాల, కందుగుల,ధర్మరాజ్ పల్లి,పెద్దపాపయ పల్లి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్,

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

-000-

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక ఈనెల 30 న జరగనున్న సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గం లోని పోలింగ్ కేంద్రాలను శుక్రవారం సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తనిఖీ చేశారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామాగ్రి తో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని శనివారం జరిగే పోలింగ్ కు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోలింగ్ సిబ్బంది తో మాట్లాడారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో హెల్ప్ డెస్క్, హెల్త్ డెస్క్ ఉండాలని అన్నారు. ఓటర్లు మాస్కు ధరించి పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చూడాలని భౌతిక దూరం పాటించేలా చూడాలని అన్నారు. హెల్త్ డెస్క్ లో పీపీ కిట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. కరోనా రోగులు పీపీ కిట్లు ధరించి సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో
విద్యుత్ సౌకర్యం, వీల్ చైర్లను పరిశీలించారు. హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ని రెండు పోలింగ్ కేంద్రాలను, హుజురాబాద్ మండలం లోని కందుగుల జడ్.పి.హెచ్.ఎస్ లోని మూడు పోలింగ్ కేంద్రాలను, ధర్మరాజుపల్లి ప్రాథమిక పాఠశాల లోని రెండు పోలింగ్ కేంద్రాలను, పెద్ద పాపయ్య పల్లి జడ్.పి.హెచ్.ఎస్ లోని మూడు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ధర్మరాజుపల్లి గ్రామ ప్రజలతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

కలెక్టర్ ఆర్ ఆర్ వి కర్ణన్ వెంట అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, తాసిల్దార్ లు తదితరులు ఉన్నారు.

 

Share This Post