హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో FST, SST బృందాలకు నిర్వహించిన అవగాహన సదస్సు లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పాల్గొన్న పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్.

నిష్పక్షపాతంగా పారదర్శకంగా హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వాహణ

ఎన్నికల విధుల కోసం నియమించబడిన బృందాలు, సిబ్బంది ప్రతి ఒక్కరూ రెండు డోస్ లు వ్యాక్సినేషన్ తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

ఎఫ్.ఎస్.పి., ఎస్.ఎస్.టి. బృందాలకు శిక్షణ

00000

హుజురాబాద్ శాసన సభ నియోజక వర్గానికి అక్టోబర్ 30 న జరుగనున్న ఉప ఎన్నికను పకడ్బందీగా, శాంతియుతంగా, నిస్పక్షపాతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

బుధవారం హుజురాబాద్ పట్టణం లోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో ప్లైయింగ్ స్క్వాడ్, స్టాటిస్టిక్స్ సర్వైవల్ బృందాలకు సెక్టోరల్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ తో కలిసి అయన పాల్గొన్నారు. ముందుగా కళాశాలలో ఏర్పాటు చేసే రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కోసం స్థల పరిశీలనతో పాటు కళాశాలలోని గదులను సిపి. తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి., బృందాల శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో జరిగే వయోలెన్స్ ఫిర్యాదులకు వెంటనే స్పందించి అక్కడికి చేరుకొని నివేదికలు అందించాలని తెలిపారు. ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి., బృందాలు ఎన్నికలు జరిగే వరకు 24 గంటల పాటు మూడు షిప్టులలో పని చేస్తాయని తెలిపారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా కుదించారని, జాతీయ పార్టీలకు 20, రిజిష్టర్డ్, అన్ రిజిష్టర్డ్ పార్టీలకు 10 మంది స్టార్ క్యాంపెయినర్లకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. ఇన్ డోర్ లో 200, ఔట్ డోర్ లో 1,000 లోపు మందితో మాత్రమే సభలు నిర్వహించాలని, రోడ్డు షోలు, మోటార్ బైక్ ల ర్యాలీలకు అనుమతి లేదని కలెక్టర్ తెలిపారు. ఇంటింటి ప్రచారంలో 5 గురు మాత్రమే పాల్గొనాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించే వారి పై కేసులు బుక్ చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మద్యం, నగదు, బహుమతులు పంపిణీ చేసే వారి పై నిఘా పెట్టాలని అన్నారు. పక్షపాతం, వ్యతిరేకత లేకుండా విధులను నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించాలని ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి. బృందాలకు సూచించారు. ఉప ఎన్నిక విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పని సరిగా తీసుకోవాలని తెలిపారు. మాస్కు తప్పని సరిగా ధరించాలని, చేతులు సానిటైజ్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఏ పార్టీలకు అనుకూలంగా పని చేయవద్దని అన్నారు.

పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించుటకు ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి., బృందాలు తమ వంతు సహకారం అందించాలని అన్నారు. రాజకీయ పార్టీలు పంపిణీ చేసే మద్యం, చీరలు, గడియారాలు, బహుమతులు, పది వేలకు పైగా విలువ కలిగిన వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిస్తే వెంటనే వీడియో తీయడంతో పాటు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించి కేసులు బుక్ చేయాలని అన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతి లేకుండా విధులకు గైర్హాజర్ కావద్దని బృందాలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, హుజురాబాద్ ఆర్.డి.వో. రవీందర్ రెడ్డి, తహశీల్దార్లు, డి.సి.పి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post