హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో నిర్వహించిన రెండవ ర్యాండమైజషన్ లో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పాల్గొన్న సాధారణ ఎన్నికల పరిశీలకుడు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ, రిటర్నింగ్ అధికారి సి. హెచ్. రవీందర్ రెడ్డి.

ఈవీఎంలు, వివి ప్యాట్ల రెండో ర్యాండమైజేషన్ పూర్తి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

ర్యాండమైజేషన్ లో పాల్గొన్న ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణ న్ శంకర్ నారాయణ

000000

హుజురాబాద్ నియోజకవర్గం శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈవీఎంలు, వివి ప్యాట్ ల రెండవ ర్యాండమైజేషన్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి. కర్ణ న్ నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ, హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ రవీందర్ రెడ్డి ల తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఉప ఎన్నికల పోటీ లో ఉన్న స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో రెండవ ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజురాబాద్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్న 896 బ్యాలెట్ యూనిట్లు, 427 కంట్రోల్ యూనిట్లు, 543 వివి ప్యాట్ల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గం లోని 306 పోలింగ్ స్టేషన్ లకు పంపించుటకు గానూ ర్యాండమైజేషన్ ద్వారా 612 బ్యాలెట్ యూనిట్ లు, 306 కంట్రోల్ యూనిట్ లు, 306 వీ వీ ప్యాట్లను ఎంపిక చేశామని తెలిపారు. 254 బ్యాలెట్ యూనిట్లు, 121 కంట్రోల్ యూనిట్లు, 237 వీ వీ ప్యాట్లు మొత్తం 40 శాతం ఈవీఎంలను రిజర్వులో ఉంచుతామని అన్నారు. రిజర్వు ఈవీఎంలను పోలింగ్ రోజు ఉదయం సెక్టోరల్ అధికారులు, తాసిల్దార్ లకు అప్పగిస్తామని తెలిపారు. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్లలో లో ఈవీఎంలు పని చేయనట్లయితే వాటి స్థానంలో రిజర్వు లో ఉన్న ఈ వీ ఎం లను వినియోగిస్తామని అన్నారు. ఈనెల 21వ తేదీన గురువారం హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈవీఎంల కమిషన్ నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో నీ స్ట్రాంగ్ రూమ్ లను రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రతినిధులు, పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో తెరిచారు. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్లలో విద్యుత్ అంతరాయం కలిగితే, వినియోగించేందుకు ప్రతి పోలింగ్ స్టేషన్ కు సోలార్ విద్యుత్ దీపాలు అందుబాటులో ఉంచు తామని తెలిపారు. ఉప ఎన్నికల పోటీలో ఈసారి 30 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఇందుకోసం రెండు బ్యాలెట్ యూనిట్ లు వినియోగించాల్సి ఉంటుందని అన్నారు. పోలింగ్ బూత్ కంపార్ట్మెంట్ పెద్దగా ఉంటుందని రెండు బ్యాలెట్ యూనిట్లు పక్కపక్కన ఉంటాయని అన్నారు.

స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ- ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణ న్ శంకర్ నారాయణ

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికను శాంతియుత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ అన్నారు. ర్యాండమైజేషన్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళినీ కఠినంగా అమలు చేస్తామని అన్నారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.

ర్యాండమైజేషన్ కార్యక్రమంలో హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి, ఆర్ డి ఓ సిహెచ్. రవీందర్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రతినిధులు, పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు.

 

Share This Post