సెక్టోరల్అధికారులు విధులను సమర్థంగా నిర్వర్తించాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సెక్టోరల్ అధికారులతో సమావేశం
000000
ఈ నెల 30న జరగనున్న హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా సెక్టోరాల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.ఆదివారం రాత్రి హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సెక్టోరల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ జరిగే హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని పోలింగ్ కేంద్రాల పరిధిలో పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేయాలని సూచించారు. పోలింగ్ స్లిప్పులు పంపిణీ సమయంలో సంబంధిత ఇంట్లో లేని ఓటర్లు, మరణించిన వారి, బదిలీ అయిన వారి వివరాలను సమర్పించాలని సెక్టోరల్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలలో విద్యుత్, ర్యాంపులు, టాయిలెట్లు సౌకర్యం, వీల్ చైర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. రిజర్వ్ ఈవీఎంలను సెక్టోరల్ అధికారుల వద్ద ఉంచుతామని, పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాలలో పనిచేయని ఈవీఎంల స్థానంలో రిజర్వు లో ఉన్న ఈవీఎంలను వెంటనే అందజేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో షామియానాలు వేయించాలని, నీళ్లు ఉంచాలని అన్నారు. ఓటర్లు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా చూడాలి అని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ తీస్తామని, అన్ని పోలింగ్ కేంద్రాలకు సోలార్ ల్యాంపులు పంపిస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి సిహెచ్. రవీందర్ రెడ్డి, సెక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.