: హుజురాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లోని RTPCR క్యాంపు ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

 

కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

000000

కోవిడ్ నిర్ధారణ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించి సర్టిఫికెట్లు ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.

హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఎన్నిక సందర్భంగా హుజురాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన కోవిడ్ ఆర్ టి పి సి ఆర్ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రతినిధులు, అభ్యర్థులు కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసు లేదా రెండవ డోసు తీసుకొనని వారు తప్పనిసరిగా టి ఆర్ సెంటర్ లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని సర్టిఫికెట్ పొందాలని సర్టిఫికెట్ పొందాలని తెలిపారు. కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్న వారికే పోలింగ్ ఏజెంట్లుగా కౌంటింగ్ ఏజెంట్లు గా అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఆర్టిపిసిఆర్ సెంటర్ కు వచ్చే వారికి ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసుకొని కామెంట్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డిఓ, రిటర్నింగ్ అధికారి సిహెచ్. రవీందర్ రెడ్డి, తహసీల్దార్ రామ్ రెడ్డి, డీఎంహెచ్ వో డాక్టర్ జువేరియా తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post