హుజురాబాద్ మండలం కేంద్రంలో దళిత బంధు క్లస్టర్ అధికారులు గ్రౌండింగ్ కమిటీ సభ్యులు మరియు బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

  1. పత్రికా ప్రకటన.తేదీ: 29-12-2021

    కరీంనగర్
    మంజూరైన దళిత బంధు యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలి
    దళిత బంధు అర్హులైన వారందరి ఖాతాలలో డబ్బులు జమ చేయాలి

    డైరీ యూనిట్లు ఎంపిక చేసుకున్న వారికి షెడ్ల నిర్మాణం కోసం వెంటనే డబ్బులు విడుదల చేయాలి

    జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
    Oo0

    హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకం కింద మంజూరైన యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో
    దళిత బంధు పథకం అమలుపై క్లస్టర్ అధికారులు ఎంపీడీవోలు బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన వారందరికీ దళిత బంధు పథకం అమలు అవుతుందని, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, తప్పి పోయిన దళిత బంద్ లబ్ధిదారుల ఇంటింటి సర్వే చేసి అర్హులైన వారి ని గుర్తించి వారందరీ ఖాతాలు ఓపెన్ చేసి, వారి ఎకౌంట్లలో నగదు జమ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు అర్హులై ఉండి ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో డబ్బు జమ కాని వారందరికీ వెంటనే నగదు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. డైరీ యూనిట్లు ఎంపిక చేసుకున్న వారికి షెడ్ల నిర్మాణం కోసం రూ. 1.50 లక్షలు చొప్పున వెంటనే అందజేయాలని తెలిపారు. దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ లో ఎంపీడీవోలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. లబ్ధిదారులకు యూనిట్ల ఎంపికలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులు ఇప్పటికే ఎంపిక చేసుకున్న యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

    ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, క్లస్టర్ అధికారులు, ఎంపీడీవోలు, వివిధ బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

    సహాయ సంచాలకులు, సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ వారికే జారీ చేయడమైనది.

Share This Post