హుజురాబాద్ మండలం కేంద్రం లోని దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల యూనిట్లు ఫోటో స్టూడియో, సారీస్ & మ్యాచింగ్ సెంటర్ ను ప్రారంభించిన SC కార్పొరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్,

దళితబందు తో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
0000

దళితబందు పథకం ద్వారా ఆర్థిక సాధికారత, స్వావలంబనను సాధించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

బుధవారం హుజురాబాద్ నియోజకవర్గం లోని హుజురాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక లలో దళిత బందు పథకం కింద మంజూరైన లబ్ధిదారుల యూనిట్ల షాపులను ప్రారంభించి వారికి అభినందనలు తెలిపారు.
హుజురాబాద్ నియోజకవర్గంలోని చెల్పూర్ గ్రామంలో దళితబందు ద్వారా లబ్దిపొందిన సౌజన్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెయింటింగ్ షాపును పెట్టుకోగా కలెక్టర్ అక్కడకు సైతం వెళ్లి షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకు దళిత బంధు పథకాన్ని రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తుందని, ఈ పథకం ద్వారా లబ్ధిదారులు వారికి నచ్చిన యూనిట్లను ఎంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. మొదటి విడతలో రూపాయలు 5 లక్షలను మంజూరు చేయడం జరిగిందని. దీనితో లబ్ధిదారులు యూనిట్ ను ప్రాంభించుకున్న తరువాత మిగిలిన మొత్తాన్ని మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడుతూ వారు ప్రాంభించుకున్న షాపులను మరింత అభివృద్ధి చేసుకునే దిశగా కృషిచేయాలని అన్నారు. అనంతరం జమ్మికుంటలో పలు కిరాణా షాపు నిర్వాహకులతో మాట్లాడుతూ షాప్ లైసెన్సు గురించి అడిగి తెలుసుకున్నారు, లైసెన్సు లేకుండా షాపులను నిర్వహించరాదని సూచించారు. మున్సిపల్ అధికారులు లైసెన్సుల పై దుకాణదారులకు అవగాహన కల్పించాలని, అదేవిదంగా సక్రమంగ టాక్స్ ను వసులు చేసి రెవెన్యూను పెంచాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జెడ్పి సీఈఓ ప్రియాంక, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Share This Post