హుజురాబాద్ మండలం చల్పూర్ , జమ్మికుంట మండలం ఆబాదిజమ్మికుంట లో ఓటరు నమోదు సర్వేను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

ఓటరు జాబితాలను వేగవంతంగా నవీకరించాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

హుజూరాబాద్ నియోజకవర్గం లో ఓటర్ల
జాబితాలను పరిశీలించిన కలెక్టర్

000000

ఓటర్ జాబితాలను వేగవంతంగా నవీకరించాలి (అప్డేట్ )అని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ ఏఈఆర్ఓలు, ఈఆర్వోలను ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ హుజూరాబాద్ మండలం చేల్పూర్ గ్రామంలో, జమ్మికుంట మండలం ఆబాది జమ్మికుంట లో క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఓటరు జాబితాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అయన మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణలకు సంబంధించి జాబితాను, ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. మరణించిన వారి పేర్లను, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించాలని, తొలగించే ముందు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇవ్వాలని అన్నారు. ఓటర్ జాబితాల నవీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డిఓ రవీందర్ రెడ్డి, ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ వో లు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post