హుజురాబాద్ మండలం జుపాకలో దళిత బంధు పథకం కింద మంజూరైన డెయిరీ యూనిట్ నిర్వహిస్తున్న ఇల్లందుల శైలజ-హరీష్ దంపతులు (కరీంనగర్ జిల్లా)

నాడు భవన నిర్మాణ కూలీలు…నేడు డెయిరీ యజమానులు

దళిత బంధు పథకంతో వారి జీవితాల్లో వెలుగులు

డెయిరీతో నెలకు రూ.40 వేల ఆదాయం

   కేసిఆరే మా దేవుడు అంటున్న లబ్దిదారులు

నాడు భవన నిర్మాణ కూలీలుగా పనిచేసిన ఇల్లందుల శైలజ- హరిష్ దంపతులు నేడు దళిత బంధు పథకం మంజూరుతో డెయిరీకి యజమానులుగా మారారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన ఇల్లందుల శైలజ- హరిష్ లు గతంలో భవన నిర్మాణాల్లో కూలీలుగా పనిచేస్తూ జీవన పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాజంలో అత్యంత దుర్బర జీవితం గడుపుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపుటకు హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రవేశ పెట్టారు. ఈ పథకం కింద లబ్దిదారులు వారికి అనుభవం, అభిరుచి ఉన్న స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకునుటకు హుజురాబాద్ నియోకజకవర్గంలోని అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరు చేసినారు. అక్టోబర్ 2021 లో దళిత బంధు పథకం ఇల్లందుల శైలజ- హరిష్ దంపతులకు మంజూరైంది. వెంటనే ఇల్లందుల హరిష్ ప్రభుత్వ పశు వైద్య అధికారులు, కరీంనగర్ డెయిరీ అధికారుల సహాయంతో హర్యానా రాష్ట్రం లోని రోహతక్ జిల్లాకు వెళ్లి మొదటి విడుతగా 4 పాడి గేదెలను కొనుగోలు చేసుకొని తెచ్చుకున్నారు. ఈ పథకం కింద ముందుగా డెయిరీ షెడ్ వేసుకొనుటకు రూ. లక్షా యాభై వేలు ప్రభుత్వం మంజూరు చేసింది. తెచ్చుకున్న 4 పాడి గేదెలను షెడ్ లో భార్యాభర్తలు కలిసి పోషించుకుంటూ ఉదయం  20 లీటర్లు, సాయంత్రం 20 లీటర్లు, మొత్తంగా రోజుకు 40 లీటర్ల పాలను కరీంనగర్ డెయిరీకి అమ్ముచున్నామని తెలిపారు. తద్వారా తమకు నెలకు 40 వేలకు పైగా ఆదాయం వస్తుందని అన్నారు.  ధాణా, ఇతర ఖర్చులు పోగా నెలకు 30 వేల రూపాయలు మిగులుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా హరిష్ దంపతులు మాట్లాడుతూ నిరుపేదలైన మేము గతంలో కూలీ పనికోసం వేరే గ్రామానికి వెళ్ళి కూలీ కోసం నిరీక్షించేవారమని ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా అంధించిన 10 లక్షల రూపాయలతో మొదటి విడుత కొనుగోలు చేసిన పాడి గేదెలతో ఇంటివద్దనే డెయిరీ ఏర్పాటు చేసుకొని భార్యాభర్తలం హాయిగా పనిచేసుకుంటున్నామని అన్నారు. మాకు ఇద్దరు ఆడపిల్లలని, సిరిసిల్ల జిల్లాలోని సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో చదివిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మాకు దేవుడైన కేసిఆర్ మంజూరు చేసిన దళిత బంధు పథకం మొదటి విడుత  ద్వారా నెలకు 40 వేలకు పైగా ఆదాయం పొందుతున్నామని తెలిపారు. రెండవ విడుత ద్వారా కూడా మరో 4 పాడి గేదెలు తెచ్చుకుని చక్కని పోషణతో నెలకు   లక్ష రూపాయల వరకు ఆదాయం గడిస్తామని హరిష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాడి గేదెలకు ధాణా ఎండుమేత మాత్రమే వేస్తున్నామని త్వరలో పచ్చిమేత కూడా అందిస్తే ఇంకా ఎక్కువ పాలిచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ డెయిరీ యూనిట్ ద్వారా మా ఇద్దరికే కాక ఇంకా ఇద్దరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతామని అన్నారు. ఎంతో ముందుచూపుతో దళితులను సమాజంలో ఇతర కులాలతో సమానంగా ఆర్థికాభివృద్ది సాధించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం తమకే కాకుండా మాతోటి దళితులందరికి జీవితాల్లో కూడా వెలుగులు నింపుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Share This Post