హుజురాబాద్ మండలం సింగాపూర్ లో డైరీ యూనిట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ (కరీంనగర్ జిల్లా)

డైరీ యూనిట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

లబ్ధిదారులకు పలు సూచనలు సలహాలు అందించిన కలెక్టర్

000

బుధవారం హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామంలో దళిత బంధు పథకం కింద గ్రౌండింగ్ అయిన డైరీ యూనిట్లను జిల్లా కలెక్టర్ ఆర్. వి కర్ణన్ పరిశీలించారు .డైరీ యూనిట్లు ఎంపిక చేసుకొని పాడి గేదెల ను హర్యానా రాష్ట్రం నుండి తెచ్చుకున్న  లబ్ధిదారులు ఈరెళ్ల సమ్మయ్య, ఎలకపల్లి సమ్మయ్య   ల పాడి  గేదెల ను కలెక్టర్ పరిశీలించి పాడి గేదెలు ఇచ్చే పాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నాయని కలెక్టర్ లబ్ధిదారులు అడగగా హర్యానాలో కొనుగోలు చేసినప్పుడు రోజుకు ఎనిమిది నుండి 12 లీటర్ల వరకు పాలు ఇచ్చేవ నీ, కానీ ఇక్కడకు వచ్చిన తరువాత తక్కువ పాలు ఇస్తున్నాయని  తెలిపారు. రోజుకు 5, 6   లీటర్ల కు మించి పాలు ఇవ్వడం లేదని తెలిపారు .సుమారుగా ఆరు రకాల దానాలు కలిపి రోజుకు నాలుగు కిలోల చొప్పున వాటికి అందించాలని, పాడి గేదెల కు  ఉదయం సాయంత్రం నీటితో శుభ్రం చేయాలని తద్వారా  అధికంగా పాలు ఇచ్చే అవకాశం ఉంటుందని కలెక్టర్ వారికి సూచించారు. లబ్ధిదారులకు రెండవ విడతలో తెలంగాణ లేదా ఆంధ్రాలో పాడి గేదెలు కొనుగోలు చేసుకునేలా చూస్తామని అన్నారు . పాడి గేదెల పోషణకు ఇంటిల్లి పాది అందరూ కలిసి  కష్టపడి లాభాలు పొందాలని కలెక్టర్ తెలిపారు. డైరీ యూనిట్ల ద్వారా నే లబ్ధిదారులకు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ సూచించారు

Share This Post