హుజురాబాద్ మండల కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్లను,పోలింగ్ సెంటర్ ను , ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, జనరల్ అబ్జార్వర్ డాక్టర్ ఓంప్రకాష్.

ఉప ఎన్నిక.. నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల పరిశీలకుడు, కలెక్టర్
00000

హుజరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ ఓం ప్రకాష్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పరిశీలించారు. అనంతరం హుజురాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రంలో వసతి, సౌకర్యాలను పరిశీలించారు.
అక్కడ నుంచి హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో ని డిస్ట్రిబ్యూషన్ కం రిసెప్షన్ సెంటర్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నిక ముగిసాక ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ లను తనిఖీ చేశారు. అలాగే సీసీ కెమెరాలు, లైటింగ్, భద్రత కోసం ఏర్పాటు చేసిన ఇనుప జాలీల కంచెలను పరిశీలించారు. ఇంకా చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఎన్నికల పరిశీలకుడు డాక్టర్ ఓం ప్రకాష్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులకు తగు సూచనలు చేశారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

 

Share This Post