హుజుర్నగర్ నియోజకవర్గం లో పల్లె దావఖన బస్తీ దావఖానలను శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు జగదీశ్ రెడ్డి

రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి తో కలిసి సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఇక్కడ పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమాలు హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ముందుండి వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా మఠంపల్లి సెంటర్ లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన కాసోజు శ్రీకాంతా ఆచారి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పులమాలలు వేశారు. హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి భారీ గజమాలతో మంత్రులకు స్వాగతం పలికారు . అంతకుముందు నేరేడుచర్ల మండలంలోని రామాపురం మున్సిపాలిటీలోగల ఏడవ వార్డు నందు13 లక్షలతో నిర్మించిన బస్తి దావఖానాను ప్రారంభించిన మంత్రులు, అనంతరం గడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామంలో 20 లక్షలతో నిర్మించనున్న పల్లె దవాఖానాకు మంత్రులు శంకుస్థాపన చేసి , భూమి పూజ చేశారు. అలాగే పొలగోడులో 22.4 లక్షలతో నిర్మించనున్న రైతు వేదిక భవనానికి శంకుస్థాపన చేశారు. భారీ ర్యాలీతో ఊరేగింపుగా గరిడేపల్లి మండలంలోని రాయిని గూడెం లో నిర్మించిన పల్లె దవాఖానాను మంత్రులు ప్రారంభించారు. అనంతరం భారీ వాహనాలతో ఊరేగింపుగా హుజూర్నగర్ పట్టణానికి వచ్చిన మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిని హుజూర్నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గేల్లి అర్చన ఘన స్వాగతం పలికారు. అక్కడనుండి మంత్రులు మట్టపల్లి లోని లక్ష్మీ నరసింహ స్వామి దివ్య క్షేత్రాన్ని సందర్శించారు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతాలతో ఆహ్వానం పలికి ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ శాసనసభ్యులు గొల్ల మల్లయ్య యాదవ్, మిర్యాలగూడెం శాసనసభ్యులు భాస్కరరావు,సూర్యాపేట జడ్పీ చైర్ పర్సన్ దీపిక యుగేందర్, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, కోదాడ డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్డిఓ వెంక రెడ్డి, పాల్గొన్నారు                                         ———————————————–

Share This Post