హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన రాచపల్లి శంకర్ , నాడు డ్రైవర్ నేడు ఓనర్ వారి యొక్క విజయగాధ.

                                       విజయ గాధ

 

నాడు డ్రైవర్ నేడు ఓనర్.

దళిత బంధు పథకం ఫలాలు ప్రారంభం.
o0o

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన దళిత బంధు పథకం ఫలాలను లబ్ధిదారులు అందుకుంటున్నారు. ఆగస్టు 16 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు హుజురాబాద్ లో దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి 15 మంది లబ్ధిదారులకు 10 లక్షల చొప్పున చెక్కులను సీఎం స్వయంగా అందజేశారు. ఈ 15 మంది లబ్ధిదారులలో జమ్మికుంట మండలం, శాయంపేట గ్రామానికి చెందిన రాచపల్లి శంకర్ కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా 10 లక్షల చెక్కు అందుకున్నారు.

రాచపల్లి శంకర్ తండ్రి రాజయ్య వయసు 37 సంవత్సరాలు వృత్తిరీత్యా డ్రైవర్ .దళిత బంధు డబ్బులతో అతను ఎంపిక చేసుకున్నా ఎర్టిగా కార్ ను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి ఆగస్టు 26న ,రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ లు వాహనాన్ని అందజేశారు. కారు రాకతో దళిత బంధు పథకం ఫలాలను అందుకుంటున్న రాచపల్లి శంకర్ ఆదాయం పెరిగి వారి కుటుంబం సంతోషంగా జీవిస్తుంది.

రాచపల్లి శంకర్ అభిప్రాయం వారి మాటల్లో:

నేను పేద దళిత కుటుంబానికి చెందిన వాడను. డ్రైవింగ్ నేర్చుకొని ప్రైవేటుగా డ్రైవర్ గా పనిచేస్తూ నెలకు ఎనిమిది వేల రూపాయలు సంపాదించే వాడను .నాకు ఒక పాప 10వ, తరగతి, బాబు 8వ తరగతి, భార్య తల్లిదండ్రులు ఉన్నారు. వృత్తి రీత్యా డ్రైవర్ గా పనిచేస్తూ, నేను సంపాదించే జీతం డబ్బులు సరిపోక మా కుటుంబం ఎంతో కష్టంగా పేదరికంలో జీవనం కొనసాగించే వారము. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు , సమాజంలో నిరుపేదలైన దళితుల ను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు .దళిత బంధు పథకం ద్వారా నాకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 10 లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. 10 లక్షలతో ఎర్టిగా కారును జిల్లా కలెక్టర్ గారు కొనుగోలు చేసి ఇచ్చారు . ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ దళిత బంధు పథకం ద్వారానే నాడు డ్రైవర్ గా ఉన్న నేను నేడు ఓనర్ ను అయినాను. నా చేతికి కారు వచ్చిన నుండి నాలుగైదు రోజులు కారును కిరాయి లకు తిప్పాను . తర్వాత . నాకున్న పరిచయాలతో దళిత బంధు పథకం కింద ప్రభుత్వం నాకు ఇచ్చిన కారును జమ్మికుంట మండలం జెడ్పిటిసి డాక్టర్ . శ్రీ రామ్ శ్యామ్ గారు ఎంగేజ్ కు తీసుకున్నారు . పెట్రోల్ ఖర్చులు వారే భరిస్తూ నాకు నెలకు ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు. దీంతో మా జీవితాల్లో కష్టాలు పారిపోయి ,వెలుగులు నిండాయి . నేను కలలో కూడా అనుకోలేదు ఒక కారుకు యజమానిని అవుతానని .నాకు దళిత బంధు పథకం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10 లక్షలు మంజూరు చేసి కారు కొనుగోలు చేసి ఇచ్చినoదులకు వారికి జీవితాంతం నేను, నా కుటుంబ సభ్యులందరూ ఎంతో రుణపడి ఉంటాము . రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశపెట్టి వాటిని సమర్థవంతంగా అమలు చేస్తూ ఎంతో మంది పేద ప్రజలను ఆదుకుంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉంటూ ,అందరినీ అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాను.

హుజూరాబాద్ నియోజకవర్గం లోని ఐదు మండలాల్లో 21000 దళిత కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి వారందరికీ పది లక్షల చొప్పున దళిత బందు నిధులు వారి అకౌంట్ లో జమ చేయుటకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం కింద లబ్ధిదారులు వారికి ఇష్టమైన స్వయం ఉపాధి పథకాలు ఎంచుకుంటే వాటిని గ్రౌండింగ్ చేయుటకు ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది ఇంతవరకు హుజూరాబాద్ నియోజకవర్గం లో 14371 మంది లబ్ధిదారుల ఖాతాలో దళిత బంధు నిధులు జమ చేశారు మిగిలిన అర్హులైన లబ్ధిదారులకు ప్రతిరోజు జమ చేస్తున్నారు.

 

 

Share This Post