హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు.

హుజరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన హైదరాబాద్ నుంచి కరీం నగర్ ,హనుమకొండ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ కలక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ,సీపి తరుణ్ జోషి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ మాట్లాడుతూ అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో విద్యుత్, టాయిలెట్ల సౌకర్యంతో పాటు వీల్ చైర్ ఉండేలా చూడాలని తెలిపారు. ఓటర్లు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా చూడాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతారు అని వారి కోసం షామియానాలు ఏర్పాటుచేసి కుర్చీలు వేయాలని సూచించారు. ఎన్నికల సామాగ్రి సిద్ధంగా పెట్టుకోవాలని తెలిపారు. ఈవీఎంలు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్ లు, ప్యాట్లు సిద్ధం చేయడంతో పాటు రిజర్వ్ లో కూడా పెట్టుకోవాలని తెలిపారు. పోలింగ్ రోజు ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే రిజర్వ్ ఈవీఎంలను అందించాలని అన్నారు. పోలింగ్ రోజు ఉదయము తప్పనిసరిగా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించాలని తెలిపారు. మాక్ పోలింగ్ తర్వాత వివి ప్యాట్ ల లోని స్లిప్పులు తొలగించి సీల్ చేయాలని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ తీయించాలని అన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు. సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ వీడియోగ్రఫీ నిర్వహిస్తామని తెలిపారు. ఓటర్లు కు నూటికి నూరు శాతం కరోనా టీకాలు వేస్తున్నమనీ అన్నారు. కేంయసీ,కమలాపూర్ మండలం లో కరొనా పరిక్షలు పూర్తి స్థాయి లో నిర్వహిస్తున్న ట్లు తెలిపారు.కరీంనగర్ కలక్టర్ తో ఎన్నికల విధులను సమన్వయ పరుస్తున్నట్లు వివరించారు.. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేస్తున్నామని తెలిపారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అర్ డి వో వాసుచంద్ర, డియం అండ్ హెచ్ఓ లలితాదేవి, డీఈవో నారాయణరెడ్డి, కమలపూర్ ఎంపిడిఓ భాస్కర్, ఎసిబి జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post