హెచ్.పి. సి.ఎల్. వంట గ్యాస్ సరఫరా పైప్ ఏర్పాటుపై సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన    తేది:04.01.2022, వనపర్తి.

కర్ణాటక రాష్ట్రం హసన్ నుండి హైదరాబాద్, చర్లపల్లి వరకు పైపు ద్వారా హెచ్.పి. సి.ఎల్. వంట గ్యాస్ సరఫరా చేసేందుకు నివాస, ప్లాట్ల యజమానుల నుండి పరిహారం, అభిప్రాయాలు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
మంగళవారం రాజస్వ మండల అధికారి కార్యాలయ మందిరంలో రెవెన్యూ అధికారులు, రైతులు, స్థల యజమానులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజపేటలోని పరిసర ప్రాంతాన్ని ఇంటింటికీ వంట గ్యాస్ పైప్ ఏర్పాటు చేయుటకు నివాస, ప్లాట్ల యజమానుల నుండి పరిహారం, అభిప్రాయాలు కోరుతున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే మన రాష్ట్రంలో వివిధ జిల్లాలలో అమలు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఇంటింటికీ పైపు ద్వారా గ్యాస్ సరఫరా చేసినట్లయితే సరఫరా వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు.
వనపర్తి జిల్లాలో 64 కిలోమీటర్లు పైప్ లైన్ పూర్తయినట్లు, 2.1 కిలోమీటర్లు పెండింగ్లో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. దీని ద్వారా నివాస స్థల, ప్లాట్ల యజమానులు, రైతులు నష్టపోకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, హెచ్ పి. కంపెనీ జిఎం ఇమితియాజ్ అర్షడ్, డి.జి. ఎం. కృష్ణ మోహన్, సి.ఏ. వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ సమద్, ప్లాట్ల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post