*హెలిప్యాడ్ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్*

నల్లగొండ : బుధవారం జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,ఎస్.పి.రెమా రాజేశ్వరి కలిసి పరిశీలించారు.నేడు(బుధవారం)
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నల్లగొండ పట్టణం లోని ఎన్.జి. కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యుత్ శాఖ,మున్సిపాలిటీ,ఆర్&బి,పోలీస్ అధికారులతో చర్చించి సూచనలు చేశారు.హెలిప్యాడ్ మైదానం వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలు షిఫ్ట్ చేయాలని,చెట్లను ట్రిమ్ చేయాలని సూచించారు.భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యల పై జిల్లా ఎస్.పి.కలెక్టర్ తో చర్చించారు.జిల్లా కలెక్టర్ తో 0అటు నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి,   ఆర్&బి ఈ ఈ నరేందర్,విద్యుత్ శాఖ డి.ఈ. విద్యా సాగర్,తహశీల్దార్ నాగార్జున, సిఐలు చంద్రశేఖర్ రెడ్డి, చీర్ల శ్రీనివాస్, ఇతర పోలీస్ అధికారులున్నారు.

*హెలిప్యాడ్ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్*

Share This Post