*హెల్త్ సబ్ సెంటర్ భవనాల నిర్మాణాల్లో వేగం పెంచాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*హెల్త్ సబ్ సెంటర్ భవనాల నిర్మాణాల్లో వేగం పెంచాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ప్రచురణార్థం-2*
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 9: జిల్లాలో చేపడుతున్న హెల్త్ సబ్ సెంటర్ భవనాల నిర్మాణాల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్లతో హెల్త్ సబ్ సెంటర్ భవనాల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ. 5 కోట్ల 60 లక్షల వ్యయ అంచనాలతో జిల్లాకు 35 హెల్త్ సబ్ సెంటర్ భవనాల నిర్మాణానికి పనులు చేపట్టామన్నారు. 26 భవన నిర్మాణాలు పురోగతిలో ఉండగా, 9 చోట్ల ఇంకనూ పనులు ప్రారంభించలేదన్నారు. ఇంకనూ ప్రారంభం కాని భవనాల సమస్యలు పరిష్కరించి, వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. స్థల, ఇసుక విషయంలో స్థానిక తహసీల్దార్లను సమన్వయం చేసుకోవాలన్నారు. శాఖచే చేపడుతున్న ఇతర అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులు వేగంగా పూర్తికి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి. సత్యప్రసాద్, పంచాయితీరాజ్ ఎస్ఈ సుదర్శన్, డీఈ లు చంద్రశేఖర్, భూమేశ్వర్, సత్యనారాయణ, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post