హెల్త్ సర్వేలో వ్యాధులకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలి – కలెక్టర్

నిజామాబాద్, ఆగస్టు 3:–

సమగ్ర ఆరోగ్య సర్వే పూర్తిగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు.

మంగళవారం నుండి వారం రోజుల పాటు జిల్లాలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ తో కలిసి ఆయన నగరంలోని 48 వ డివిజన్ పరిధిలోగల పాటిగల్లి., 9 వ డివిజన్ లోని వడ్డెర కాలనీలో పర్యటించి సర్వే తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉన్నట్లయితే వారికి కోవిడ్ కిట్టు అందజేయాలని, ప్రతిరోజు మందులు వాడుతున్నారా లేదా పరిశీలించాలన్నారు.
Covid. 19, క్యాన్సర్, హెచ్ఐవి,. తలసేనియా.,టిబి, డయాలసిస్ తదితర ఆరు అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని గుర్తించడానికి ప్రతి ఒక్క ఇల్లు విడవకుండా సందర్శించి వ్యాధులు ఉన్నవారికి పరీక్షలు జరిపి ట్రీట్మెంట్ అందించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదయం నుండే సమయం వృధా చేయకుండా పక్కాగా, ఫర్ఫెక్ట్ గా సర్వే చేయాలని,. మొబైల్ యాప్ లో symptoms ఉన్నవారి డాటా ఎన్ట్రీ చేయాలన్నారు. సర్వేలో సందర్భంగా సేకరించిన వివరాలు నమోదు చేస్తున్న రిజిస్టర్ పరిశీలించారు.

అనంతరం నాగారం స్టేడియంలో ఉన్న పట్టణ ప్రకృతి వనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పెద్ద మొక్కలు చాలా బాగున్నాయి అన్నారు.

డివిజన్ కార్పొరేటర్ వనిత శ్రీనివాస్, ఇంచార్జ్ డి ఎం హెచ్ వో సుదర్శనం, సూపర్వైజర్లు, Anm . అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post