హెల్త్ హబ్ గా భూపాలపల్లి జిల్లా :: రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు

హెల్త్ హబ్ గా భూపాలపల్లి జిల్లా :: రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు

ప్రచురణార్థం-1

హెల్త్ హబ్ గా భూపాలపల్లి జిల్లా :: రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు

జయశంకర్ భూపాలపల్లి, మే 9: జయశంకర్ భూపాలపల్లి జిల్లా హెల్త్ హబ్ గా మారనున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ లతో కలిసి వైద్య ఆరోగ్య మంత్రి జిల్లాలో 102 కోట్లతో వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన పలు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో ఘణపురం మండలం చెల్పూర్ గ్రామంలో రూ. 41 కోట్ల 80 లక్షల1అంచనాలతో నూతన జిల్లా ఆసుపత్రి భవనం, రూ. 15 కోట్ల అంచనాలతో 50 పడకల సమీకృత ఆయుష్ వైద్యశాల నిర్మాణాలకు శంఖుస్థాపనలు, భూపాలపల్లి లో కోటి 25 లక్షలతో నూతన డయాగ్నోస్టిక్ హబ్ భవన శంఖుస్థాపన, 29 కోట్ల 46 లక్షల వ్యయంతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి భవనం, 11 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన ప్యాలియేటివ్ సేవాకేంద్రం ప్రారంభోత్సవం, 16 లక్షల 60 వేల అంచనా వ్యయంతో కొత్త ఆర్టీపిసిఆర్ ల్యాబరేటరీ, 54 లక్షల అంచనాలతో 20 పడకల పిల్లల ప్రత్యేక సంరక్షణ విభాగము, 3 లక్షల 65 వేల వ్యయ అంచనాలతో ఎన్సిడి క్లినిక్ పునరుద్ధరణ పనులు శంఖుస్థాపనలు, 46 లక్షల వ్యయంతో నిర్మించిన అక్షయ కేంద్రం ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, వైద్యపరంగా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు జిల్లాలో సమకూర్చుతున్నట్లు తెలిపారు. దాదాపు 6 కోట్లతో రేడియాలజీ, పాథాలజీలు అందుబాటులోకి తెచ్చుకొని, 56 రకాల పరీక్షలు పైసా ఖర్చు లేకుండా చేయడానికి ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆల్ట్రా సౌండ్, మెమెగ్రఫీ, టుడీ ఎకో వంటి పరీక్షలు ఉచితంగా భూపాలపల్లి ప్రజలకు అందించడానికి శంఖుస్థాపనలు చేశామన్నారు. చిన్న పిల్లల కోసం న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్, ఐసీయులు ఏర్పాటు చేసుకున్నామన్నారు. సిటీ స్కాన్ మిషన్ మంజూరు చేస్తున్నట్లు, వారం రోజుల్లో డయాలసిస్ కేంద్రం మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరు అయినట్లు, ఈ విద్యా సంవత్సరం లోనే ప్రారంభించనున్నట్లు ఆయన అన్నారు. భూపాలపల్లి లో డాక్టర్లు, ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు ఉంటారని ఆయన తెలిపారు. ఎఎన్ఎం సబ్ సెంటర్లకు ఒక్కో భవనానికి 20 లక్షల చొప్పున 40 ఏఎన్ఎం సబ్ సెంటర్లకు 8 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన అన్నారు. పీడియాట్రిక్ ఐసీయూ 200 పడకల ఆసుపత్రిలో అందుబాటులోకి తెస్తామన్నారు. 75 ఏళ్లలో ప్రస్తుత ప్రభుత్వం రాక ముందు భూపాలపల్లి లో ఒక్క పిహెచ్ సి ఉండేదని, ఇప్పుడు మెడికల్ కాలేజీ, పిహెచ్ సీలో 10 పడకలకు ఒక్క డాక్టర్ ఉంటే, మెడికల్ కాలేజీ కి 150 మంది డాక్టర్లు, 650 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. పేదలకు మంచి వైద్యం అందుబాటులోకి రావాలని ఇదంతా చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఆసుపత్రుల్లో సీ సెక్షన్ ఆపరేషన్లు ఎక్కువగా చేస్తున్నట్లు, ఇది మహిళలకు, పుట్టే పిల్లలకు మంచిది కాదని, ఆర్థికంగా కూడా ఇబ్బంది అవుతుందని, సాధారణ డెలివరీలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. భూపాలపల్లి లో రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు, ఇందుకై రాష్ట్రంలో ఈ జిల్లాతో పాటు 8 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ పథకాన్ని వచ్చే నెల రోజుల్లో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. సాధారణ ప్రసవాలకు ప్రజల సహకారం కావాలని ఆయన అన్నారు. కొద్ది మంది డాక్టర్ ల వద్దకు వెళ్లి, మంచి ముహుర్తాలు, మంచి రోజులు అని, ఆపరేషన్లకు బలవంతం చేస్తున్నట్లు, ఇట్టివి మానుకోవాలని మంత్రి అన్నారు. ఆసుపత్రిలో అవసరమైన సిబ్బందిని మంజూరు చేస్తామని, సి సెక్షన్ ఆపరేషన్లు తగ్గించాలని ఆయన తెలిపారు. ఇక్కడి జెడ్పి చైర్ పర్సన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ భార్య, ఎస్పీ భార్య ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగాయని ఆయన అన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిల్లో 30 శాతం మాత్రమే ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేవని, తెలంగాణ వచ్చాకా 56 శాతానికి పెరిగాయని, కానీ 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలని, సాధారణ ప్రసవాలు జరగాలని మంత్రి తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్క కాటు, పాము కాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలన్నారు. కరోనా సమయంలో ఆశాలు, ఏఎన్ఎంలు చాలా కష్టపడ్డారని, ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే చేశారని, మందులు ఇంటివద్దే అందించారని, అందుకే సీఎం వారి వేతనాలు పెంచారని, ఇంకా కష్టపడితే ఇంకా పెంచమని అడుగుతానని ఆయన అన్నారు.

సభలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, జిల్లా ఏర్పాటుతో అధికారులు అందుబాటులో ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ 3146 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, 75 ఏళ్ల గిరిజనుల కలను నెరవేర్చారని అన్నారు. గిరిజనులను సర్పంచులు చేయడమే కాకుండా ఆత్మగౌరవంతో తామే పాలించుకొనేలా చేశారన్నారు. 12 వేల 56 కోట్ల నిధులు గిరిజన సంక్షేమం కోసం కేటాయించినట్లు ఆమె అన్నారు. ఇట్టి నిధుల్లో వేయి కోట్లు రోడ్ల కోసం ఖర్చుచేయనున్నట్లు, జిల్లాకు ఎక్కువ నిధులు గిరిజన తండాలకు బీటీ రోడ్లు వేస్తామన్నారు. ఆరోగ్యలక్ష్మీ క్రింద భోజనం, కేసీఆర్ కిట్, ఉచిత పరీక్షలు, నెలకు రెండు వేల చొప్పున 12 వేల రూపాయలు మగబిడ్డ పుడితే, 13 వేలు ఆడపిల్ల పుడితే ఇస్తున్నట్లు నన్తరి అన్నారు. వెనుకబడిన జిల్లాల్లో మహిళల న్యూట్రీషన్ కిట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అందులో భూపాలపల్లి జిల్లా ఉన్నట్లు ఆమె తెలిపారు. పేదింటి ఆడపిల్లలకు లక్షా నూట పదహార్లు ఇచ్చిన ఘనత ప్రభుత్వానిది ఆమె అన్నారు.

సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ, భూపాలపల్లి అభివృద్ధి చెందిందంటే ఈ ప్రభుత్వం వల్ల అని అన్నారు. సాగు, తాగు నీటి సమస్యలు ఉండేవని, ఇప్పుడు పొలాల్లో నీరు, బోర్లలో నీరు పుష్కలంగా ఉందని అన్నారు. చెరువులు బాగుచేసుకున్నట్లు, కాళేశ్వరం ప్రాజెక్టును చేసుకున్నట్లు ఆయన అన్నారు. ఏఎన్ఎం, ఆశాలు కరోనా సమయంలో బాగా పనిచేసారన్నారు. డెలివరీకి ప్రయివేటు ఆసుపత్రులకు వెళితే 30 నుండి 40 వేలు ఖర్చు అయ్యేదని, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ప్రసవాలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. 2016 ఆసరా పెన్షన్లు ఇస్తున్నట్లు, బిడ్డ పుడితే 12 వేలు, 13 వేలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. ఇండ్లు కట్టుకోవడానికి స్థలం ఉన్నవారికి, వారి స్థలంలోనే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, భూపాలపల్లి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, వరంగల్ జెడ్పి చైర్ పర్సన్లు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, రాష్ట్ర వైద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ శ్రీనివాస్, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర టీఎస్, భూపాలపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ వెంకట రాణి, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post