హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థినికి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా 25 వేల చెక్కు అందజేత.

జిల్లా రెవెన్యూ ఉద్యోగులు హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ గా ఏర్పడి వారి జీతములోనుండి నెల నెలా డబ్బులు జమచేస్తు పేద విద్యార్థులను MBBS చదివిస్తున్న సంగతి తెలిసినదే…
ఈ రోజు కూడా పేద విద్యార్థిని అయిన వంచ సౌమ్య D/o విద్యాసాగర్
నిజామాబాద్ కు చెందిన విద్యార్థినిని గత 4సంవత్సరాలుగా హైదరాబాద్ ఉస్మానియా లో ఎం బి బి ఎస్
ఫైనల్ ఇయర్ చదువుతున్నాది ఈ విద్యార్థి తండ్రికి ఈరోజు రెవెన్యూ ఉద్యోగులు ఏర్పాటు చేసిన హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి గారి మీదుగా ఈ సంవత్సరానికి గాను 25 వేల రూపాయల చెక్కు అందజేయడం జరిగింది ఇది 4నాల్గవసారి,
అలాగే జిల్లా కలెక్టర్
సి. నారాయణ రెడ్డిగారు మాట్లాడుచు రెవెన్యూ ఉద్యోగులు స్వచ్ఛందంగా పేద పిల్లల చదువు కొరకు అది ఎంబీబీఎస్ చదువు కొరకు అండగా నిలవటం చాలా ఆనందంగా ఉంది మొన్ననే పది రోజుల క్రితం ఒక విద్యార్థికి 25వేల చెక్ ఇచ్చారు ఇప్పుడు మరో విద్యార్థినికి 25 వేలు ఇవ్వడం నిజముగా మిమ్మల్ని అభినందిచక తప్పదు అని రెవెన్యూ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ గారు ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ రమన్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ కుమార్ గారు అసోసియేట్ అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్ గారు డిచ్ పల్లి తహసిల్దార్ శ్రీనివాసరావు, కలెక్టరేట్ అధ్యక్షులు మహేష్ గారు సంఘ నాయకులు కార్తిక్ రెడ్డి, దత్తాద్రి,దీపక్ గార్లు పాల్గొన్నారు.

Share This Post