హైదరాబాద్ చెంగిచెర్లలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ ను వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి సందర్శించి, మొక్క నాటిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న డైరెక్టర్ ఎస్.బి బర్ బుద్దే, ప్రిన్స్ పల్ సైంటిస్ట్ బస్వారెడ్డి తదితరులు

*హైదరాబాద్ చెంగిచెర్లలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ ను వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి సందర్శించి, మొక్క నాటిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న డైరెక్టర్ ఎస్.బి బర్ బుద్దే, ప్రిన్స్ పల్ సైంటిస్ట్ బస్వారెడ్డి తదితరులు*

అంతర్జాతీయ ఉత్పాదకతను అందుకోవాలి

ఉత్పాదకత పెంచుకుంటేనే మార్కెట్ డిమాండ్ ను తట్టుకొని నిలబడగలుగుతాం

చైనా లాంటి దేశాలలో ఎకరాలో వంద క్వింటాళ్లు పండిస్తే మనం ఎకరాలో 30 క్వింటాళ్లు మాత్రమే పండించ గలుగుతున్నాం

మాంసం అయినా, వ్యవసాయ ఉత్పత్తులు అయినా అంతర్జాతీయ సగటుకు సమానంగా పండించగలిగితేనే అంతర్జాతీయ మార్కెట్ లో పోటీ పడగలుగుతాం

దేశంలో వుండే గొర్రెలు 7-5 కోట్లు. ఒక్క తెలంగాణలోనే 2 కోట్ల గొర్రెలున్నాయి. ఏడాదికి దేశ సగటు తలసరి మాంసం  వినియోగం 6 కేజీలు. కాని తెలంగాణ సగటు తలసరి వినియోగం 23 కేజీలు. అంటే మనకున్న గొర్లు కాక ప్రతీరోజు ఇతర రాష్ట్రాలవి దిగుమతి చేసుకుంటున్నం. అందువల్ల మన గొర్ల సంఖ్య ఇంకా పెంచుకుంటూ, మాంసం దిగుబడి అధికంగా వచ్చే బ్రీడ్స్ ను అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు సగటు గొర్రె మాంసం 13 కేజీలు. కనీసం 25 కేజీల సగటు సాధిస్తే మన భవిష్యత్ అవసరాలు తీరుతాయి.

స్థానిక భాషలో ఉత్పాదకత పెంపునకు గల అవకాశాల వివరాలను ముద్రించి గొర్రెల, మేకల పెంపకందారులకు అందుబాటులో ఉంచాలి

తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఆమోదించింది… పరిశోధన కేంద్రం ఏర్పాటుకోసం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తాము.

కంది, జొన్న, మొక్కజొన్న, పప్పుశనగ, ఉలవ, మినుము పంటల నూర్పిడి తర్వాత మిగిలే వ్యర్థాల మిశ్రమాలు గొర్రెల మేతకు ఎంతో ఉపయోగపడతాయి

గొర్రెల పెంపకం, మాంసం ఎగుమతుల్లో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవాలి

భారత్ వంటి దేశంలో ఏ మార్పునైనా స్వీకరించడానికి కొంత ఆలస్యం అవుతుంది .. మార్పు మొదలైతే వేగంగా పెను మార్పులకు దారి తీస్తుంది.
గొర్రెలు, మేకల పెంపకందారులు సొసైటీలుగా ఏర్పడి ఈ దిశగా మాంసం ఎగుమతులపై దృష్టిసారించాలి

నిజాం ముని మనవడు ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపకం చేస్తున్నారు .. పనిని ఎప్పుడూ నామోషీగా భావించకూడదు

వనపర్తిలో అత్యాధునిక స్లాటర్ హౌజ్, మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకుందాం

దేశంలో ఎక్కువ గొర్రెలు ఉన్న ప్రాంతం తెలంగాణ, తెలంగాణలో ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి పాలమూరులో వనపర్తి ప్రాంతంలో ఎక్కువ గొర్రెలు ఉన్నాయి

వనపర్తి గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలోని 192 సంఘాలు  మాంసం ఎగుమతుల మీద దృష్టి సారించాలి

హైదరాబాద్ చెంగిచెర్లలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ ను వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి సందర్శించి, మొక్క నాటిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న డైరెక్టర్ ఎస్.బి బర్ బుద్దే, ప్రిన్స్ పల్ సైంటిస్ట్ బస్వారెడ్డి, జేడీ వెంకటేశ్వర్ రెడ్డి, వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం చైర్మన్ కురుమూర్తి యాదవ్, వైస్ చైర్మన్ చంద్రయ్యయాదవ్ తదితరులు

Share This Post