హైదరాబాద్ జిల్లాలో వివిధ డిగ్రీ కాలేజీలలో చదువుతున్న విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ కృషి చేయాలనీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో Commissionerate of Colligate Education Development ఆధ్వర్యంలో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. డిగ్రీ కాలేజీలో హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. టీచింగ్ నాన్ టీచింగ్ కు సంబందించిన  వివరాలను  అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ కాలేజీలలో ఎన్ని పోస్టులు ఉన్నాయని, అందులో సిబ్బంది వివరాలు, ఖాళీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలేజీలలో ఎయె కోర్సులు ఉన్నాయి, ఆ కోర్సులలో  అడ్మిషన్ శాతాన్ని  అడిగి తెలుసుకున్నారు. కాలేజి ఆవరణలో హరిత హారం నిర్వహించాలని సూచించారు. కాలేజీలలో మౌలిక వసతులైన మంచి నీరు, డ్రైనేజీ, మరుగుదొడ్లు వంటి వాటి గురించి ప్రిన్సిపల్స్  కలెక్టర్ కు వివరించారు. స్కాలర్ షిప్స్, ఫీజు రేయింబర్సుమెంట్ కై అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

            జిల్లా ఉపాధి అధికారి మైత్రిప్రియ మాట్లాడుతూ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రేనింగ్ అందించేందుకు ప్రతి డిగ్రీ కాలేజీలో గదిని కేటాయించాలని కాలేజీ ప్రిన్సిపల్స్ ను కోరారు.

            ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్ర కుమార్, షెడ్యూల్డ్ కులాల అభివృధి అధికారి రామారావు, డి ఆర్ సి కో ఆర్డినేటర్ విజయ ప్రసాద్ రావు, వివిధ డిగ్రీ కాలేజీ ల ప్రిన్సిపల్స్, డిస్ట్రిక్ట్ ఇమ్మునైజషన్ ఆఫీసర్ సరళ కుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

????????????????????????????????????

Share This Post