హైదరాబాద్ జిల్లా పరిధిలో మాతృ మరణాల శాతాన్ని తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతృ మరణాల పై జరిగిన సమీక్షా సమావేశంలో డి ఎం హెచ్ ఓ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతృ మరణాల శాతాన్ని తగ్గించేందుకు డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలతో పాటు గర్భిణీలకు కావలసిన మందులు అందుబాటులో ఉన్నాయని వాటిని సకాలంలో వినియోగించి గర్భిణీలు ఆరోగ్యాంగా ఉండి సుఖ ప్రసవం అయ్యేలా చూడాలన్నారు. గర్భం దాల్చిన నాటి నుండి ప్రసవం అయ్యేవరకు ఎదురయ్యే సమస్యలు గురించి క్షేత్ర స్థాయిలో వైద్య శాఖ సిబ్బందికి అవగాహనా కలిపించడం తో పాటు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సేవలందించాలన్నారు. గర్బిణీలలో రక్తహీనతఐరన్ లోపంజన్యు లోపలను స్కానింగ్ సమతంలో గుర్తించినట్లయితే వారి కుటుంబ సబ్యులకు తెలియపరచడంతో పాటు సీనియర్ డాక్టర్ల సలహా మేరకు వైద్య సేవల కోసం రిఫెరల్ ఆసుపత్రికి పంపించాలన్నారు. ఆశఏఎన్ఎం లు గర్భిణీలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ మందులుపౌష్టికాహారం సరిగా తీసుకునేలా సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. తద్వారా సమాజంలో మాతృ మరణాలను అరికట్టవచ్చని కలెక్టర్ సూచించారు.

            జిల్లా వైద్యాధికారి డా.వెంకటి మాట్లాడుతూ బాలింతల మరణాల శాతాన్ని తగ్గించడానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి గర్భిణీ నమోదైనడి మొదలు బీపీ హిమోగ్లోబిన్ 11 ఉండేలా ఐరన్విటమిన్ మాత్రలు స్కానింగ్ మరియు అంగన్వాడీ సెంటర్ల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

            ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ  జయమాలినినిలోఫర్ ఆసుపత్రి నోడల్ అధికారి అరుణ కుమారి ఎస్ ఫై హెచ్ ఓ లుమెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎం లుఆశ వర్కర్లు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

????????????????????????????????????

Share This Post