హైదరాబాద్ నగరాన్ని రాజకీయాలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి అభివృద్ధికి కృషి చేయాలనీ గురువారం జరిగిన దిశా (డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) కేంద్ర ప్రతిపాదిత పథకముల నిర్వహణలో రెండవ సారి జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర సాంస్కృతిక మరియు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

ఈ సమావేశంలో కేంద్ర ప్రతిపాదిత పధకములు హైదరాబాద్ జిల్లాలో ఏ మేరకు అమలవుతున్నాయో దిశా కమిటీ చైర్ పర్సన్ గా సమీక్షించారు. ఈ కమిటీ కి కేశవ రావు ఎం పి రాజ్యసభ, అసదుద్దీన్ ఒవైసి ఎం పి హైదరాబాద్, కో చైర్మన్లు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ మెంబర్ సెక్రటరీ గాను, ఎం ఎల్ ఏ లు, చైర్ పర్సన్ నామినేటెడ్ చేయబడిన 4 గురు సభ్యులు మరియు కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖచే నామినేట్ చేయబడిన వారు ఇందులో సభ్యులు  సురేందర్ జిల్లా సిపిఒ మెంబెర్ కన్వీనర్. ఈ సమావేశంలో కంటోన్మెంట్  సి ఈ ఓ  అభిజిత్ రెడ్డి, అవినాష్ మహంతి, పోలీస్  జాయింట్ కమీషనర్ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీస్ శాఖకు సంబంధించి హైదరాబాద్ లో రక్షణ లా అండ్ ఆర్డర్, మహిళా సంక్షేమం పై చర్చ జరిగింది. హైదరాబాద్ లో మధ్యాహ్న భోజన పధకంలో 69 వేళా మంది విద్యార్థులు హాజరవుతున్నారని, సర్వశిక్షాభియాన్ పై చర్చించారు.

            జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ 85 యుపిఎచ్సిలు, 133 బస్తి దవాఖానాలు పని చేస్తున్నాయని వీటిలో సిబ్బంది పూర్తిస్థాయిలో ఉన్నారని కోవిద్ గురించి ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టిందని తెలిపారు. బస్తి దవాఖానాలు కొత్తగా 18  ఏర్పాటు చేశామని మరియు 44  ఏర్పాటు చేస్తున్నామని ఇవన్నీ ఎక్కువగా పేదలకు ఉపయోగపడతాయని తెలిపారు. బస్తి దవాఖానాల గురించి సభ్యులు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. 2017 నుండి ప్రారంభించిన కేసీఆర్ కిట్స్ పథకం వలన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య బాగా పెరిగిందన్నారు. కోవిద్ సమయంలో కూడా 73  శాతానికి వచ్చిందని తెలిపారు.  టిబి నిర్ములనలో హైదరాబాద్ ఉన్నత స్థానంలో ఉందని, ఏరియా, జిల్లా ఆసుపత్రులలో కోవిద్ టెస్టులే కాకుండా  నాన్ కోవిద్ టెస్టులు కూడా చేస్తున్నామన్నారు.  సివిల్ సప్లై విషయంలో జాతీయ ఆహార భద్రతా చట్టం, జాతీయ పంపిణి పథకం, వన్ నేషన్ వన్ రేషన్ ల పై చర్చించారు. హైదరాబాద్ లో వీధి వ్యాపారుల సర్వే జి ఎచ్ ఎం సి నిర్వహిస్తుందని, ఇట్టి  సర్వే పురోగతిలో ఉందని తెలిపారు. వీధి వ్యాపారులకు లోన్లు శాంక్షన్ చేయడంలో ముందుందని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ల పధకంలో నిర్మాణ  పనులు చాల చురుకుగా సాగుతున్నాయని అన్నారు. చివరగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దిశా సమావేశాలు రెగ్యులర్ గా 3 నెలలకొకసాని నిర్వహించాలని అందరికి మాట్లాడే అవకాశం కలగాలని పూర్తీ సమాచారం తో రావాలని అన్నారు. మీరు ఏ సమస్యలైనా నా దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తానని అన్నారు.

            జిల్లాకు సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని ఏవైనా సమస్యలు ఉంటె నాకు తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.

????????????????????????????????????

Share This Post