హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మెంబర్ సెక్రటరీ వై. రేణుక

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం

44 రోజుల పాటు గ్రామాల్లో అవగాహన

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ వై. రేణుక
-000-

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వార పేద ప్రజలందరికి ఉచిత న్యాయ సహాయం అందుతుందని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ వై. రేణుక అన్నారు.
గురువారం హైదరాబాద్ నుండి గ్రామాలలో ఉచిత న్యాయ సహాయం పై అవగాహన కార్యక్రమాల అమలు పై జిల్లా న్యాయమూర్తులు, టీమ్ మెంబర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి, న్యాయ సేవా చట్టం అమలుల్లోకి వచ్చి 25 సంవత్సరములు పూర్తి అయినందున ఆజాదీక అమృత్ మహొత్సవాలలో భాగంగా అక్టోబర్ 02 నుండి నవంబర్ 14 వరకు అన్ని గ్రామాలలో ఉచిత న్యాయం చట్టాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ఉచిత వైద్యం ఎలా అందుతుందో అలాగే జిల్లాలలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో పేద ప్రజలకు ఎలాంటి ఫీజులు లేకుండా ఉచిత న్యాయ సహాయం అందుతుందని, ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నామని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రతి రెండు నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించి పెండింగులో ఉన్న కేసులను పరిష్కరిస్తున్నామని అన్నారు. సమాజంలో 30 శాతం మంది మాత్రమే ఉచిత న్యాయ సేవను వినియోగించుకుంటున్నారని, మిగిలిన 75 శాతం మంది తమ ఆస్తులను అమ్ముకొని న్యాయ సహయం పొందుతున్నారని తెలిపారు. అందుకే ప్రజలందరికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహయం అందుతుందని తెలుపుచూ ప్రజల్లో అవగాహన పెంపొందించుటకు 44 రోజుల పాటు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 11,650 గ్రామాలు ఉన్నాయని, అన్ని గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు యజ్ఞంల కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామాలలో ప్రజల్లో అవగాహన పెంపొందించుటకు జ్యూడిషియల్ ఆఫీసర్, ప్యానల్ లాయర్, పారా లీగల్ వాలంటీర్లు, న్యాయ విద్యార్థులు, ఎన్.జి.వో. లు, సోషల్ అక్టివిస్టుల తో టీములను ఏర్పాటు చేసి గ్రామాలలో ప్రజలకు ఉచిత న్యాయం, న్యాయ చట్టాల పై అవగాహన పెంపొందిస్తున్నామని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాలలో సమస్యలు ఉంటే తెలపాలని, వాటిని నివృత్తి చేస్తామని ఆమె అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని, ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జ్ భవానీ చంద్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సుజయ్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, టీమ్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post