హైదరాబాద్ రాజేంద్రనగర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో యాసంగి పంటల సాగుకు సమాయాత్తం, వానాకాలం పంటల ఉత్పత్తుల అంచనాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు

హైదరాబాద్ రాజేంద్రనగర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో యాసంగి పంటల సాగుకు సమాయాత్తం, వానాకాలం పంటల ఉత్పత్తుల అంచనాలపై  నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు*

యాసంగి వరి సాగులో నూక శాతం తక్కువ వచ్చే రకాలను సాగుచేయాలి

శాస్త్రవేత్తల సూచనల మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలి

యాసంగి వరి సాగులో మార్చి లోపు కోతలు పూర్తికావాలి

మార్చి 31లోపు కోతలు పూర్తయ్యేలా పంటకాలాన్ని 15 నుండి 30 రోజులు ముందుకు వచ్చేలా రైతులను అధికారులు చైతన్యం చేయాలి

తద్వారా మార్చి నెల ముగిసిన తర్వాత వచ్చే అకాలవర్షాలు, వడగండ్ల వానల బారిన పడకుండా పంటను కాపాడుకోగలుగుతారు

యాసంగిలో మినుములు, పొద్దుతిరుగుడు, పప్పుశెనగ, వేరుశెనగ, నూనెగింజల సాగును ప్రోత్సహించాలి

యాసంగి సాగు సన్నద్దతకు గతంలో మాదిరిగానే జిల్లాల వారీగా సమావేశాల ఏర్పాటుకు ఆదేశం .. రోజుకు రెండు జిల్లాలలో ఏర్పాటుకు ప్రణాళిక సిద్దం చేయాలి

రైతులు పండించే అన్నిరకాల పప్పుదినుసుల పంటలను కేంద్రం 25 శాతమే కొనుగోలు చేస్తున్నది .. రైతులు పండించిన పంటలు మద్దతుధరకు కేంద్రం మొత్తం పంటలు కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం

వేరుశెనగ సాగులో ఎకరాకు 65 నుండి 70 కిలోల విత్తనాలు విత్తుకుంటే సరిపోతుంది .. రైతులకు అవగాహన లేక వ్యాపారుల మాట విని ఎకరాకు క్వింటాలు వేసి అనవసరంగా పెట్టుబడి భారం పెంచుకుంటున్నారు

ఎకరాకు ఏ పంటకు ? ఎంత విత్తనం వేయాలి ? ఎంత ఎరువులు వేయాలి ? అన్న విషయంలో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి

వనపర్తి జిల్లాలో వేరుశెనగ పరిశోధనా కేంద్రంలో మౌళిక వసతుల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలి

పంటలు పెద్దఎత్తున మార్కెట్ కు వస్తాయి కాబట్టి టార్పాలిన్ల కొరత రాకుండా చూసుకోవాలి

నిబంధనల ప్రకారం పత్తి రైతుకు మద్దతుధర దక్కేలా, తూకాలలో రైతులు నష్టపోకుండా సీసీఐ, జిన్నింగ్ మిల్లులతో చర్చించి చర్యలు తీసుకోవాలి

రాష్ట్రంలో ఉల్లి మరియు ఇతర కూరగాయలు వినియోగం దృష్టిలో పెట్టుకొని యాసంగి ప్రణాళిక సిద్దంచేయాలి .. ఉల్లి రైతు నష్టపోకుండా వివిధ దేశాలలో ఆచరిస్తున్న విధానాలు పరిశీలించాలి

వేరుశెనగ సాగుచేసే ఉమ్మడి పాలమూరు, పాత రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో రైతులు ఎకరాకు 200 కిలోల జిప్సం వేసుకోవాలి

శెనగ సాగు చేసే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, గద్వాల, అసిఫాబాద్, సిద్దిపేట జిల్లాల్లోకి ట్రెకో డెర్మా విరిడి వినియోగం పెంచాలి

వరి సాగులో భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా (పీ.ఎస్.బి)ను ఎకరానికి రెండు కిలోలు వినియోగించాలి

అపరాలు, పప్పుదినుసు పంటల సాగులో  ఎకరానికి 200 గ్రాములు రైజోబియం వినియోగించాలి .. తద్వారా నత్రజని స్థిరీకరణ జరిగి కాయ సైజు, బరువు, కాయల సంఖ్య పెరిగేందుకు దోహదపడుతుంది

ప్రతి ఏటా భూసార పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించేలా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ప్రణాళిక సిద్దం చేయండి

యాసంగిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రాలు వ్యవసాయ శాఖ విత్తనక్షేత్రాలలో పత్తి సాగును ప్రయోగాత్మకంగా చేపట్టాలని ఆదేశం

తెలంగాణ వ్యవసాయ రంగాన్ని అగ్రభాగాన నిలపాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కల .. అది నెరవేరింది.

గత ఎనిమిదేళ్లలో తెలంగాణ గ్రామీణ వ్యవసాయ  స్వరూపం మారిపోయింది

రైతులలో ప్రభుత్వం మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్నది .. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేస్తున్నారు

పంటలసాగులో అవగాహన పెంచేందుకు రైతువేదికలను సమర్దవంతంగా వినియోగించుకోవాలి .. స్థానిక ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయాలి

యాసంగి పంటల సాగుకు సంబంధించి రైతువేదికలలో నిర్వహించే కార్యక్రమాలపై నెలవారీ క్యాలెండర్

మార్కెటింగ్ శాఖ రీసెర్చ్ , అనాలసిస్ వింగ్ చేసిన సూచనల ప్రకారం మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలసాగును ప్రోత్సహించాలి

హైదరాబాద్ రాజేంద్రనగర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో యాసంగి పంటల సాగుకు సమాయాత్తం, వానాకాలం పంటల ఉత్పత్తుల అంచనాలపై  నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానశాఖ సంచాలకులు హన్మంతరావు, అదనపు కమీషనర్ హన్మంతు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి,  ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్, మార్క్ ఫెడ్ ఎండీ యాదవరెడ్డి, సీడ్స్ ఎండీ కేశవులు, వేర్ హౌసింగ్ ఎండీ జితేందర్ రెడ్డి,  రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్ కుమార్,  డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ జగదీశ్వర్, అదనపు సంచాలకులు విజయ్ కుమార్, లక్ష్మణుడు, ఉద్యానశాఖ జేడీ సరోజిని , శాస్త్రవేత్తలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు

Share This Post