హోరా హోరిగా కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి యూత్ ఛాంపియన్ చిప్ బాస్కెట్ బాలు పోటీలు

తేదీ.26.5.2023.

సూర్యాపేట.

 

హోరా హోరీగా రాష్ట్రస్థాయి యూత్ ఛాంపియన్షిప్ బాస్కెట్బాల్ పోటీలు.

 

– కన్నుల పండుగగా కొనసాగుతున్న క్రీడలు.

 

– రెండో రోజు తలపడిన పలు జిల్లాల బాస్కెట్బాల్ క్రీడా కారులు.

 

– ఎంతో ఉత్సాహంతో క్రీడను వీక్షిస్తున్న పుర ప్రజలు.

 

 

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ యూత్ ఛాంపియన్షిప్ పోటీలు రెండో రోజు శుక్రవారం కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల బాస్కెట్బాల్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు తొలి రోజు పలు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడల ప్రారంభం తొలిరోజున పలు జిల్లాల జట్లకు నిర్వహించిన పోటీల్లో ఓటమి పాలైన జట్లు వెను తిరగడంతో మిగిలిన జట్లకు తొలిరోజు గెలుపొందిన జట్లకు శుక్రవారం పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఆయా జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి తమ క్రీడా పటిమను ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల క్రీడాకారులు సూర్యాపేటకు రావడంతో పట్టణంలో సందడి నెలకొంది. నిన్న మొన్నటి వరకు నిర్మాణస్యంగా ఉన్న బాస్కెట్బాల్ కోర్టు ఒక్కసారిగా క్రీడాకారులు, వీక్షకులతో కన్నుల పండుగగా మారింది. వివిధ జిల్లాల క్రీడాకారుల ఆటను వీక్షించేందుకు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి గెలుపొందిన క్రీడాకారులకు తమ హర్షద్వానాలతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ నార్మల్ ఐజాక్, సూర్యాపేట జిల్లా కార్యదర్శి ఫారుక్, పీఈటీలు దేవరాజ్, యాదగిరి, సీనియర్ క్రీడాకారుడు మంత్రి శ్రీను తదితరులు అధికారులు పాల్గొన్నారు.

Share This Post