్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటరు సవరణ జాబితాలు పకడ్బందీగా వేగవంతంగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
బుధవారం ఓటర్ నమోదు కార్యక్రమం ,గరుడ యాప్ వినియోగం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు.
జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో నమోదు కావాలని తెలిపారు.
ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు.
ఓటర్ జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుండి ఫారం-7 ద్వారా తీసుకొని లేదా సుమోటోగా తీసుకొని ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించాలని తెలిపారు. అలాగే డబుల్ ఓటర్లను,
శాశ్వతంగా వలస వెళ్ళిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని సూచించారు.
డిసెంబర్ 20,2021లోగా అభ్యంతరాలను ,ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5,2022 న తుది ఓటరు జాబితా రుపోందించాలని ఆయన స్పష్టం చేశారు.
ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ,ప్రతి వారం స్విప్ కార్యక్రమాలకు సంబంధిచిన ప్రెస్ క్లిప్పింగ్స్ ను వాట్సా ప్ గ్రూపు లో షేర్ చేయాలని సూచించారు.
ఓటర్లకు తమ పోలింగ్ స్టేషన్ సులువుగా తెలుసుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ గరుడ యాప్ ను రుపొందించిందని, దీని పై ప్రజలలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గరుడ యాప్ వినియోగిస్తూ పరిష్కరించాలని, వివరాలను యాప్ లో అప్లోడ్ చేయాలని అధికారులకు ఆదేశించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కోవిడ్ 19 నిబంధనలు మేరకు పోలింగ్ మరియు కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
జిల్లాలో నవంబర్ ఒకటి నుండి 30వ తేదీ వరకు 6, 6A,7,8,8A లకు సంబంధించి 2398 దరఖాస్తులు అందాయని జిల్లా కలెక్టర్ హనుమంతరావు శశాంక్ గోయల్ కు తెలిపారు. అందులో నియోజకవర్గం వారీగా నారాయణఖేడ్ 302, అందోల్ 435, జహీరాబాద్ 328, సంగారెడ్డి 292, పటాన్చెరు 1041 దరఖాస్తులు వచ్చాయన్నారు.
వాటన్నింటిని సమగ్రంగా పరిశీలించి ఈ నెల 20 లోపు పరిష్కరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి అదనపు కలెక్టర్ వీరారెడ్డి,రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.