౩౦వ తేది వరకు జిల్లా లో ఉన్న అన్ని పాటశాలలు పరిశుబ్రపరుచుకోవాలి :: జిల్లా అదనపు కలెక్టర్ కే చంద్ర రెడ్డి

పత్రిక ప్రకటన

నారాయణపేట జిల్లా

తేది: 27-08-2021

౩౦వ తేది వరకు జిల్లా లో ఉన్న అన్ని పాటశాలలు పరిశుబ్రపరుచుకోవాలి  జిల్లా అదనపు కలెక్టర్ కే చంద్ర రెడ్డి

రాష్ట ప్రభుత్వం ఆదేశానుసారంగా సెప్టెంబర్ 1 నుండి పాఠశాలల పునర్ ప్రారంభం సందర్భంగా కోవిడ్ నుంచి ఇదివరకు మూసివేసిన కారణంగా  తరగతి గదులను ఆగస్ట్ ౩౦ వ తేది వరకు పరిశుబ్ర పరుచుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కే చంద్ర రెడ్డి  ఆదేశించారు.

జిల్లా కేంద్రం లో ఉన్న  ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల మరియు పియస్   పరిమాలపురం పాఠశాల  ను  అదనపు కలెక్టర్ మధ్యాహ్నం ఆకస్మిక తనిఖి చేశారు. తరగతి గదులను  పరిశుబ్రపరుచుకోవాలని వంట గదులను మరియు ముత్రశాలలో కుళ్ళయిలను  కోతగా ఏర్పాటు చేయాలనీ నిటి సౌకర్యం లేనిచో వెంటనే ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.  కంప్యుటర్ లను పరిశుబ్ర పరుచుకోవాలని సూచించారు. ఉపాద్యాయులలో వ్యాక్సిన్  వేయించుకుని వారు ఉంటె వెంటనే వేయించుకోవాలని, తప్పని సరిగా  కోవిడ్ పరిక్షలు చేయించుకోవాలని విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలని

విద్యార్థులు తల్లి దండ్రులతో సమావేశం నిర్వహించి వారికీ తగిన సూచనలు ఇవ్వాలని వారికి అవగాహనా కల్పించాలని సూచించారు. విద్యార్ధు లకు  తప్పని సరిగా మాస్క్ లను అందించాలని వారి తల్లి దండ్రులకు సూచించాలని

తరగతి గదులలో దురాన్ని పాటించేటట్లు చర్యలు చేపట్టాలని డియిఓ లియాఖత్ అల్లి కి సూచించారు, పాఠశాల ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు.  పరిశుబ్రత పై దృవీకరణ పత్రాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందించాలని ఎలాంటి నిర్లక్షం చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశుబ్రనంతరం పాఠశాల మొత్తాన్ని శనిటైజింగ్ చేయించాలని సూచించారు.

ఈ కార్యక్రమం  లో మున్సిపల్ ఈ ఈ మహేష్, మున్సిపల్ మనేజేర్ యూసుఫ్ మరియు మున్సిపాల్  సిబ్బంది శ్రీధర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

—————————————————————-

జిల్లా పౌర సంభందాల అధికారి ద్వార జరి.

Share This Post