■ వంద శాతం వ్యాక్సినేషన్ కి పకడ్బందీ ప్రణాళిక ■ నేటి నుండి జిల్లాలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

■ వంద శాతం వ్యాక్సినేషన్ కి పకడ్బందీ ప్రణాళిక ■ నేటి నుండి జిల్లాలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 15: 18 సంవత్సరాల వయస్సు నిండిన వారందరికీ వంద శాతం వ్యాక్సినేషన్ కు నేటి నుండి పకడ్బందీ ప్రణాళిక తో కార్యాచరణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్ లో అధికారులతో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యాచరణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేటి నుండి జిల్లాలో ప్రజల వద్దకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 281 గ్రామ పంచాయతీలు, 600 ఆవాసాలు ఉన్నట్లు, 17 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, 104 సబ్ సెంటర్లు ఉన్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారు 3 లక్షల 89 వేల 746 మంది ఉండగా, ఇందులో మొదటి డోసు లక్షా 61 వేయి 913, రెండవ డోసు 48 వేల 535 మంది రెండవ డోస్ ఇప్పటివరకు తీసుకున్నారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తంగా 2 లక్షల 10 వేల 448 డోసులు ఇచ్చామన్నారు. జనాభా ప్రాతిపదికన 41.54 శాతం మందికి ఇప్పటికే వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నేటి నుండి 104 సబ్ సెంటర్ల హెడ్ క్వార్టర్స్ లలో, జనగామ పట్టణంలోని 1 నుండి 15 వరకు గల వార్డుల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్ చేపట్టనున్నట్టు, ప్రతి మండలానికి, ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రానికి ఒక ప్రత్యేక అధికారిని పర్యవేక్షణకు నియమించినట్లు ఆయన అన్నారు. అదనపు కలెక్టర్, జెడ్పి సిఇఓ, డిఆర్డీవో, డిపివో సమన్వయ అధికారులుగా ఉంటారని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్ చేపట్టే గ్రామం, వార్డులలో ముందస్తుగా తేదీ, ప్రదేశం తెలుపుతూ, టాం టాం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ ఎంతో ప్రయోజనజరమని, ఎటువంటి సందేహాలు, భయాలు వద్దని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ వస్తే, ప్రాణహాని ఉండదని, త్వరగా కొలుకుంటారని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వామ్యం కావాలని, వంద శాతం వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తికి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హామీద్, జెడ్పి సిఇఓ ఎల్. విజయలక్ష్మి, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, డిఆర్డీవో జి. రాంరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ సుగుణాకర్ రాజు, జనగామ మునిసిపల్ కమీషనర్ నర్సింహా, సిపివో ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post