0-5 సంవత్సరాల చిన్నారులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ వైద్యాధికారులను ఆదేశించారు.

ఈ నెల 23వ తేదీ న జరుగనున్న పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణపై  మంగళవారం  కలెక్టరేట్ సమావేశపు హాలులో వైద్య, సంక్షేమ, జడ్పి,డీపీఓ డిఆర్డీఓ, విద్య, మున్సిపల్ కమిషనర్ లతో   ‘టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 0-5 సవత్సరాల  లోపు చిన్నారులు 97,522 మంది ఉన్నారని వీరందరికి పల్స్ పోలియో వాక్సిన్ ఇవ్వాలని చెప్పారు.  ఈ నెల జనవరి 23న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లాలోని అన్నీ ‘లైన్’డిపార్ట్ మెంట్స్ సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. నూరుశాతం పోలియో వాక్సిన్ ఇవ్వాలని చెప్పారు.   సమస్కాత్మకగ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు.  పతపోలియో కార్యక్రమాన్ని 100%, పూర్తి చేసి జిల్లాను ముందంజలో ఉంచాలని కోరారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలియో చుక్కలు మాత్రమే  చిన్నారులను పోలియో మహమ్మారి నుండి కాపాడగలవని ప్రతి ఒక్కరు తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు.  కార్యక్రమంలో డా  శిరీష, ఉప వైద్యాధికారి వినోద్, ప్రోగ్రాం అధికారి నాగేంద్ర ప్రసాద్, డిఆర్వో అశోక చక్రవర్తి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post