(0-6) సం.ల చిన్నారుల పోషకాహారం, వనరులపై సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన                                                                     తేది:7.7.2021.
వనపర్తి.

చిన్న పిల్లల పోషకాహార పథకాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని   అన్నారు.
బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అంగన్ వాడి కేంద్రాలలోని (0-6) సం.ల చిన్నారుల పోషకాహారం, వనరులపై నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్ వాడి కేంద్రాలలోని చిన్నారుల బరువు, వయస్సుకు తగిన ఎత్తు, జబ్బ చుట్టుకొలత మొదలైన అంశాలకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ఆమె సంబంధిత అధికారులకు సూచించారు.
ఆర్.బి.ఎస్.కె. మెడికల్ టీం ద్వారా, గ్రామాలలో అంగన్వాడి కేంద్రాల సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి చిన్నపిల్లలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు, తెలిపారు. జిల్లా వైద్యం ఆరోగ్య శాఖ ద్వారా చిన్నారుల ఆరోగ్యం, వైద్యం, మందుల పంపిణీ, అంగన్వాడి కేంద్రాల ద్వారా సరుకుల పంపిణీ తక్షణమే చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 3 నెలల లోపల గ్రామాలలోని 0-6 సంవత్సరాల చిన్నారుల బరువు, ఎత్తు తదితర అంశాల లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు తెలిపారు.

ప్రతి గ్రామంలో సర్పంచ్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు, అంగన్వాడి సిబ్బంది, ఒక బాలిక కలిపి ఒక కమిటీని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంగన్వాడి సిబ్బంది, అంగన్వాడికి వచ్చిన ఆహార సరుకు వెంటనే పంపిణీ జరిగిపోవాలని, జాప్యం చేయరాదని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూ ఓ పుష్పలత, వనపర్తి ప్రాజెక్టు సిడి పి ఓ కృష్ణ చైతన్య, పెబ్బేరు ఆత్మకూరు ప్రాజెక్టు సి డి పి ఓ లక్ష్మమ్మ, జిల్లా సూపర్ వైజర్లు, ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
,…………..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post