01 ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి రెండు నామినేషన్ లు దాఖలు- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

01 ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి సోమవారం రోజున రెండు నామినేషన్ లు దాఖలు అయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన గుండవరపు హరిణి ఒక సెట్ నామినేషన్ వేసినట్లు, జన్నారం మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ రియాజుద్దీన్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. నామినేషన్స్ స్వీకరించిన అనంతరం ఆయా అభ్యర్ధులచే కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.

 

Share This Post