03-09-2021*కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత వాతావరణం లో గణేష్ చతుర్థి పండుగజరుపుకోవాలి; జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*

# *గణేష్ ఉత్సవ సమితి అధికారులతో గణేష్ చతుర్థి పండుగ, గణేశ్ నిమజ్జనం ముందస్తు ఏర్పాట్లు పై సమీక్షించిన  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,డి.ఐ. జి.,ఏ.వి.రంగనాథ్*
నల్గొండ,సెప్టెంబర్ 3.గణేష్ చతుర్థి పండుగను సురక్షిత,ప్రశాంత వాతావరణం లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని,జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గణేష్ ఉత్సవ సమితి మిర్వహకులను కోరారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,డి.ఐ. జి.తో కలిసి వారం రోజుల్లో జరుపుకొనున్న గణేష్ చతుర్థి పండుగ, గణేష్ నిమజ్జనం  సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు పై గణేష్ ఉత్సవ సమితి నిర్వహకులు,పోలీస్,విద్యుత్,మున్సిపల్ కమిషనర్ లు అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక మండపాలు ఏర్పాటు చేసే భక్తులు,నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో సురక్షిత వాతావరణం లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపు కోవాలని కోరారు.గత 16 నెలలుగా కోవిడ్ కారణంగా కోవిడ్ నియంత్రణ చర్యలు పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు,గణేష్ చతుర్థి పండుగ,నిమజ్జనం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు నముసరించి జరుపుకోవాలని అన్నారు.ప్రతి మండపం వద్ద కోవిడ్ నిబంధనలు సూచిస్తూ ప్లెక్సీ ఏర్పాటు చేయాలని,భౌతిక దూరం పాటించాలని,ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించు కోవాలని అన్నారు.మండపాల నిర్వాహకులు శానిటైజర్,మాస్క్ లు ధరించేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
మండపాల నిర్వాహకులు మండపాల్లో విద్యుత్ సౌకర్యం కోసం ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 500 వాట్ల వరకు 500 రూ.లు,500 నుండి 1000 వాట్ ల విద్యుత్ వినియోగానికి 1000 రూ.లు నిర్వాహకులు చెల్లించాలని అన్నారు.ఇందుకు విద్యుత్ శాఖ ఏ.ఈ., లైన్ మన్ లకు చెల్లించేలా ట్రాన్స్కో ఎస్.ఈ. తగు చర్యలు తీసుకోవాలని,చెల్లించినట్లు రసీదు ఇవ్వాలని అన్నారు.ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మైక్ సిస్టం శబ్ద కాలుష్యం లేకుండా  పరిమితి  మేరకు వినియోగించు కోవాలని అన్నారు.డి. జె.సౌండ్ ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌండ్  పరిమితి పాటించాలని అన్నారు.డివిజన్ స్థాయిలోపోలీస్,రెవెన్యూ,విద్యుత్, మున్సిపల్,అగ్నిమాపక,గణేష్ ఉత్సవ సమితి,మండపాల  నిర్వాహకులతో డి.ఎస్.పి.లు సమన్వయ సమావేశం జరిపి మార్గదర్శకాలు వివరించాలని అన్నారు.గణేష్ ఉత్సవ సమితి కోరిన విధంగా గణేష్ శోభా యాత్ర నిర్వహించే రూట్ లో గుంతలు పడిన రహదారులు ప్యాచ్ వర్క్ రిపేర్ లు మున్సిపల్,ఆర్&బి శాఖ అధికారులు చేపట్టాలని ఆదేశించారు.గణేష్ నిమజ్జనం నిర్వహించే వల్లభ రావు చెరువు,14 వ మైల్ వద్ద క్రేన్ లు,బ్యారికెడింగ్ ,వేదికఏర్పాటుకు ఆర్&బి,మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.నిమజ్జనం చేసే చోట 5 వ రోజు,నిమజ్జనం రోజు సెప్టెంబర్ 19 న గజ ఈత గాళ్లను మత్స్య శాఖ ఏర్పాటు చేయాలని,లైటింగ్ మున్సిపల్,విద్యుత్ శాఖ ఏర్పాటు చేయాలని అన్నారు.మండపాల నిర్వాహకులు వినాయక విగ్రహ మండపాల వద్ద పరిశుభ్ర,ఆరోగ్య కర వాతావరణం ఉండేలా చూడాలని,చెత్త వేయుటకు డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.మున్సిపల్ శాఖ ప్రతి రోజు పారిశుధ్యం,చెత్త సేకరణ వాహనం ఏర్పాటు చేసి చెత్త తొలగించాలని ఆదేశించారు.
డి.ఐ. జి.,ఎస్.పి.ఏ.వి.రంగనాథ్ మాట్లాడుతూ  పండుగ వాతావరణం లో మత సామరస్యం తో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని అన్నారు.మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ కు సమాచారం అందించాలని,5 అడుగుల కంటే పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేస్తే అనుమతి తీసుకోవాలని అన్నారు.మైక్ వేళలు పాటించాలని అన్నారు.మండపాల వద్ద సి.సి.కెమెరాలు ఏర్పాటు చేయాలని, రోడ్డు ట్రాఫిక్ బ్లాక్ కాకుండా విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.మండపాల నిర్వాహకులు బలవంతంగా చందాలు వసూలు చేయరాదని అన్నారు.మండపం వద్ద రాత్రి పూట వాచ్ అండ్ వార్డ్ కు నియమించాలని అన్నారు.నిమజ్జనం రోజున పోలీస్ శాఖ ట్రాఫిక్,శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తు చర్యలు తీసుకుంటామని అన్నారు.శాంతి భద్రతలు, మత సామరస్యం భంగం కలిగేలా ప్రయత్నం చేసే అసాంఘిక శక్తులను కఠినంగా చర్యలు తీసుకుంటామని,ఎటువంటి వారైనా ఉపేక్షించేది లేదని డి.ఐ. జి.స్పష్టం చేశారు.సోషల్ మీడియా లో ప్రజల మధ్య విద్వేషాలు,నాయకులను కించ పరిచేలా,రెచ్చ గోట్టేలా కామెంట్స్ పెడితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రఘుపతి మాట్లాడుతూ ప్రభుత్వం మార్గదర్శకాల పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకొంటామని,జిల్లా యంత్రాంగం కు సహకారం అందిస్తామని అన్నారు.వర్షాకాలం రోడ్లు గుంతలు పడ్డ చోట రిపేర్ చేయాలని అన్నారు.వాతావరణ కాలుష్యం లేకుండా మట్టి విగ్రహాలు పూజించేలా అవగాహన కలిగిస్తామని అన్నారు.పోలీస్ రాత్రి గస్తీ ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ సమావేశం లో ఉత్సవ సమితి సభ్యులు సలహాలు,సూచనలు స్వీకరించి అధికారులకు జిల్లా కలెక్టర్,డి.ఐ. జి లు తగు సూచనలు చేశారు.ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,డి.ఆర్.ఓ.జగదీశ్వర్ రెడ్డి, ట్రాన్స్ కో ఎస్.ఈ. చంద్ర మోహన్,ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్,సలహా దారు శ్రీనివాస్ గౌడ్,డి.ఎస్.పి.లు,మున్సిపల్ కమిషనర్ లు,విద్యుత్,ఆర్&బి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
————————————————————సహాయ సంచాలకులు,జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం,నల్గొండ చే జారీ చేయనైనది

Share This Post