03-09-2021: విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా బోధన జరగాలి – కలెక్టర్

నిజామాబాద్, సెప్టెంబర్ 3:– విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తెరిగి పాఠ్యాంశాలు బోధించాలని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు.

శుక్రవారం స్థానిక కోట గల్లీలోని శంకర్ భవన్ పాఠశాలలో సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయులతో ప్లాన్-ఎ(గత తరగతిలో ముఖ్యమైన అంశాలు) ప్లాన్-బి (ప్రస్తుత తరగతిలో అంశాలు) తయారు చేసుకోవాలని విద్యార్థులకు సోమవారం నుండి బేసిక్స్ చెప్పాలన్నారు.

ప్రతిరోజు విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసుకొని బోధన చేయాలన్నారు. బేసిక్స్ బోధించిన 30 రోజులు పూర్తి అయిన తర్వాత పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని అంచనా వేయాలన్నారు. విద్యార్థులు అన్ని రకాల బేసిక్స్ నేర్చుకున్న తర్వాత పాఠాలకు సిద్ధం చేయాలన్నారు.

30 రోజుల తర్వాత ఏ విద్యార్థి వెనకబడి ఉండటానికి వీల్లేదని, ఆ రకంగా వెనకబడితే ఆ సబ్జెక్టు టీచర్దే బాధ్యత అన్నారు.ప్రతి ఉపాధ్యాయుడు ప్లాన్ A, ప్లాన్ B తయారు చేసుకోవాలని, ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లాలన్నారు. అమలు చేయని పాఠశాల హెచ్ఎం లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎటువంటి అశ్రద్ధ కూడదన్నారు. విద్యార్థులలో కరోనా కన్నా ముందు ఏ విధమైన సామర్ధ్యాలు ఉన్నాయో అదేవిధంగా అందుకోవాలంటే ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు.

The Dist. Collector C. Narayan Reddy visit to Shannker Bhavan School the Dist. Education Officer also seen.


పాఠశాలకు సంబంధించి ఏ రకమైన రిపేర్లు అవసరమో గుర్తించి లిస్టు తయారుచేసి రిపోర్టు ఇవ్వాలన్నారు.
టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసులను సందర్శించారు. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల ద్వారా ఎంతవరకు అర్థమయిందో ఆరా తీశారు. చదివిన పాఠాలు రివైజ్ చేసుకోవాలన్నారు.

కలెక్టర్ వెంబడి డీఈఓ దుర్గాప్రసాద్, హెచ్ ఎం రమేష్ రెడ్డి పాఠశాల టీచర్లు ఉన్నారు.

Share This Post