03-09-2021: స్కాలర్షిప్పుల ప్రక్రియ వెంటనే పూర్తి చేయండి – కలెక్టర్

నిజామాబాద్, సెప్టెంబర్ 3:–
విద్యార్థులకు రావలసిన నాలుగు సంవత్సరాల స్కాలర్షిప్ల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను విద్యాసంస్థల యాజమాన్యాలను ఆదేశించారు.

శుక్రవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో విద్యార్థుల పెండింగ్ స్కాలర్ షిప్ల పై సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2017-18 నుండి 2020-21 వరకు నాలుగు సంవత్సరాల స్కాలర్షిప్స్ ఏ కళాశాలలో ఎన్ని పెండింగ్ ఉన్నాయో, ఇంకా బయోమెట్రిక్, ఆధార్ ఇతర డాక్యుమెంట్స్ సమర్పించని విద్యార్థులు సమర్పించే విధంగా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని, ఈ వారం సమర్పించుకుంటే పెండింగ్ కింద చూపాలని అందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే వివరాలు సంబంధిత సంక్షేమ శాఖలకు సమర్పిస్తే తగు నిధుల విడుదల కై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ విషయంలో కళాశాలలో ఎంత మాత్రం అశ్రద్ధ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వీలైనంత తొందరగా సబ్మిట్ చేసి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందే విధంగా కళాశాల స్థాయిలో సంబంధిత శాఖల స్థాయిలో ప్రత్యేక కృషి చేయాలని ఎక్కడైనా అలసత్వం కనబరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ సరిగా లేని కొన్ని కాలేజీలు రిజెక్ట్ చేసిండ్రు వాటన్నిటినీ కూడా వచ్చే శుక్రవారం వరకు కచ్చితంగా కాలేజీ ప్రిన్సిపాల్ పరిశీలించి పిల్లలకు ఫోన్ చేసి రిజెక్ట్ నుండి తీసివేసి వాళ్లకు స్కాలర్ షిప్ లు మంజూరు అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు.
సమావేశానికి రాని కాలేజీల ప్రిన్సిపాల్స్ రేపు 10:30 కి హాజరు కావాలని ఆదేశించారు
ఈ సమావేశానికి డి ఐ ఈ ఓ

Scholorship-review-alowing-with-conserned-officers-by-Dist.-Collector-Sri-.-Narayan-Reddy
రఘు రాజ్, డి ఎస్ సి డి ఓ శశికళ, బీసీ వెల్ఫేర్ రమేష్ డి టి డబ్ల్యూ నాగారావు ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు

Share This Post