(03.10.2022) ప్రజావాణి కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్

పత్రికా ప్రకటన.    తేది:03.10.2022, వనపర్తి.
       ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన  ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వన్  ఆదేశించారు.
       సోమవారం ఐ డి ఓ సి. ప్రజావాణి సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) డి.వేణుగోపాల్ తో కలిసి ఆయన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా దరఖాస్తుదారుల నుండి (10) ఫిర్యాదులను స్వీకరించారు.
      ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post