(03.10.2022) వనపర్తిలోని నల్లచెరువు వద్ద సద్దుల బతుకమ్మ నిమజ్జనం : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్,

పత్రికా ప్రకటన     తేది:03.10.2022, వనపర్తి.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా ప్రకృతితో మమేకమైన పండగ “బతుకమ్మ పండగ” అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
సోమవారం వనపర్తి పరిధిలోని నల్ల చెరువు వద్ద వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నామని, “బతుకమ్మ ఉత్సవాలను” విజయవంతం చేసినందుకు వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
గతంలో వనపర్తి జిల్లా వలసల జిల్లాగా ఉన్నదని, ఎటు చూసినా నీటి వసతి సౌకర్యాలు లేకుండా బీడు భూములుగా వ్యవసాయ భూములు ఉండేవని, ప్రస్తుతం ఎటు చూసినా జలవనరులు పుష్కలంగా ఉన్నాయని, పైరు, పంటలు సస్యశ్యామలంగా వనపర్తి జిల్లా కనబడుతుందని మంత్రి వివరించారు. వనపర్తి జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని ఆయన అన్నారు. ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం శుద్ధ జలం అందించడంలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించినదని ఆయన వివరించారు. నిరంతర విద్యుత్తు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, యాభై లక్షల కుటుంబాలకు పెన్షన్లు అందిస్తున్నదని, 1009 గురుకుల పాఠశాలలు, రైతుబంధు, తదితర పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే వనపర్తి జిల్లాలో మహానగరంగా తీర్చిదిద్దుతామని, ప్రస్తుతం 600 పడకల మెడికల్ కళాశాల ఈ విద్య సంవత్సరం 20వ. తేది నుండి నిర్వహిస్తున్నట్లు, రాష్ట్రంలోనే 5వ. జె ఎన్ టి యు ఇంజనీరింగ్ కళాశాలలను తీసుకరావడం జరిగిందని, త్వరలో అగ్రికల్చర్ డిగ్రీ కళాశాలను తీసుకురావడం జరుగుతుందని ఆయన సూచించారు. త్వరలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.  9 కి.మి. మేర 100 ఫీట్ల బైపాస్ నిర్మాణం పనులు రూ.73 కోట్లతో త్వరలో చే పట్టబోతున్నట్లు మంత్రి వివరించారు. అనతి కాలంలోనే వనపర్తి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, హైదరాబాదుకు దీటుగా అన్ని వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన సూచించారు.
ఎంగిలి పూలను వెదజల్లుకునే అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలందరు తీరొక్క పూలతో సెప్టెంబర్ 25వ తేదీ నుండి అక్టోబర్ 3వ. తేది వరకు 9 రోజుల పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నాన బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మలను నిర్వహించామని ఆయన.అన్నారు.
నేటితో ముగిసే “సద్దుల బతుకమ్మ” చాలా విశిష్టమైన రోజు అని, పెద్ద బతుకమ్మను పేర్చి, గౌరమ్మను పూజించి, ఆట, పాటలతో బతుకమ్మ ఆడుతారని, 9 రకాల నైవేద్యాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. వివిధ శాఖల నుండి మహిళా ఉద్యోగినులు బతుకమ్మలు తెచ్చి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడి, పాడారు. జిల్లా మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వచ్చిన మహిళల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ఆయన సూచించారు. మహిళలతో కలిసి మంత్రి బతుకమ్మ ఉత్సవాలలో ఆడి, పాడారు. అనంతరం నల్లచెరువులో సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సం గ్వాన్, (రెవెన్యూ) డి వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి పుష్పలత, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, జిల్లా అధికారులు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, వివిధ శాఖల మహిళా ఉద్యోగినులు, ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక సంఘ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
—————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయనైనది.

Share This Post