04-09-2021: విద్యాసంస్థల్లో సమస్యలు లేకుండా చూడాలి, అటవి పునరుద్ధరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి, రైతు వేదికలు, విద్యుత్ సబ్ స్టేషన్లలో హరితహారం పూర్తిస్థాయిలో జరగాలి – కలెక్టర్

నిజామాబాద్, సెప్టెంబర్ 4:–

16 నెలల తర్వాత ప్రారంభమైన విద్యాసంస్థలలో సమస్యలు రాకుండా చూడాలని 100% కోవిడ్ నిబంధనలు పాటించాలని, అటవీ పునరుద్ధరణ పనులు మరింత వేగం పెంచాలని రైతు వేదికలు విద్యుత్ సబ్ స్టేషన్లలో పూర్తిస్థాయిలో హరితహారం జరగాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మండల స్థాయి అధికారులతో, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్.మాట్లాడుతూ స్కూల్లో కోవిడ్ ప్రోటోకాల్ 100% పాటించాలని ప్రతి విద్యార్థికి ధర్మ మీటర్ తో ఫీవర్ చెక్ చేయాలని టెంపరేచర్ ఎక్కువ ఉంటే వెంటనే పిహెచ్సి సెంటర్కు పంపి కోవిడ్ పరీక్షలు చేయించాలన్నారు. హెచ్ ఎం లు, ఏఎన్ఎంలు ప్రైమరీ కంట్రాక్టర్స్ ను టెస్టింగ్ చేయాలన్నారు.
స్కూల్లో తాగునీరు, శానిటేషన్, టాయిలెట్స్ మున్సిపాలిటీలు, జిపిల పరిధిలో ఉన్నవాటిని నిర్వహించాలని న్యూ పంచాయతీ, మున్సిపాలిటీ యాక్టు లో ఉన్నదని పేర్కొన్నారు.

విద్య మీద ఫోకస్ గా పని చేయాలని రెగ్యులర్గా ఎంఈఓలు, ఎంపిడిఓలు మానిటర్ చేయాలన్నారు. మిడ్ డే మీల్ ఎంపీడీవో, ఎంఈఓ కమిటీ మెంబర్స్ పరిశీలించాలని పాత ఏజెన్సీ సరిగా చేయకుంటే కొత్త వారిని నియమించాలని అన్నారు.

విద్యాసంస్థల్లో పనిచేసే అందరికీ 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు బుధవారం వరకు 100% వ్యాక్సినేషన్ జరగాలని, కాలేజీలు, స్కూల్స్, ప్రభుత్వ, ప్రైవేటులలో పని చేసేవారు తప్పక తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లా అధికారులు సోమవారం నుంచి స్కూల్స్ లో పర్యటన చేయాలన్నారు. టాయిలెట్స్ నీటుగా ఉంచుటకు స్కావెంజర్ ను లోకల్ బాడీస్ అపాయింట్మెంట్ చేసుకోవాలని ప్రతి స్కూల్లో ఉండాలన్నారు. టాయిలెట్స్ రిపేర్ ఉంటే చేయించాలన్నారు అవసరమున్న చోట కొత్తవి నిర్మించాలన్నారు. ఎంఈఓలు బాధ్యత తీసుకొని స్కూల్ పైకప్పులలో లేకుండా శుభ్రం చేయించాలన్నారు. అంగన్వాడి సెంటర్ లు, కాలేజీలు, స్కూల్లలో చెత్త క్లీన్ చేయించాలని పడిపోయే దశలో ఉన్న భవనాలలో విద్యార్థులను కూర్చో పెట్టవద్దని, స్కూల్లలో దాతల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్కూల్లో అసాంఘిక చర్యలకు పాల్పడితే గ్రామ సభ ఏర్పాటు చేసి జరిమానా విధించాలని, టీచింగ్ టెక్నిక్స్ మారాలి అన్నారు.

రైతు వేదికల్లో విద్యుత్ సబ్ స్టేషన్లలో ప్లాంటేషన్ గ్యాప్ లేకుండా ఉండాలని, ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ మొక్కలు ఏర్పాటు చేయాలని, వ్యవసాయ అధికారులు, ఏ ఈ ఓ లు ప్లాంటేషన్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవాలని తొందరగా ప్లాంటేషన్ పూర్తి చేయించాలన్నారు.
ఫారెస్ట్ పునరుద్ధరణ పనులు 195 జిపి లలో 1147 పనులు గుర్తించడం జరిగిందని ప్రోగ్రెస్ బాగుందని ప్రతి గ్రామపంచాయతీలలో 10 పనులు తగ్గకుండా గుర్తించాలని లేబర్ టర్నవుట్ పెంచాలని ప్రతి జిపిలో 25% యాక్టివ్ లేబర్ పనిచేయాలని తెలిపారు. బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్లు ఫీల్డ్ లో ఉండి పని చేయించాలి అన్నారు డిసెంబర్ వరకు కంటిన్యూగా చేయించాలని ఎన్ఆర్ఈజీఎస్ ఫారెస్ట్ కోఆర్డినేషన్ తో చేయాలని బృహత్ పల్లె ప్రకృతి వనం లో ప్లాంటేషన్ చేయించాలన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చిత్ర మిశ్రా., చంద్రశేఖర్, జెడ్పీ సీఈవో గోవింద్, డి ఆర్ డి ఓ చందర్ నాయక్ , డి ఈ ఓ దుర్గాప్రసాద్ , డి పి ఓ జయసుధ సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Share This Post