పత్రికా ప్రకటన*
నల్గొండ,సెప్టెంబర్ 4. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, నల్లగొండలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని న్యాయ సేవా సంస్థలకు అనుసంధానమై ఉన్న ప్యానల్ న్యాయవాదులకు వివిధ చట్టాలు, న్యాయ సేవలపై రెండు రోజుల నైపుణ్య శిక్షణా కార్యాక్రమాన్ని మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు సంస్థ ఇంచార్జి చైర్మన్ యం.నాగరాజు , కార్యదర్శి జి.వేణులు ప్రారంభించారు. కార్యాక్రమములొ అదనపు జిల్లా న్యాయమూర్తి యం.భవాణి, సీనియర్ సివిల్ జడ్జి యం. వెంకటేశ్వరరావు, నల్లగొండ న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు బి.అశోక్ కుమార్, మాస్టర్ ట్రైనర్స్ నంద, నారాయణ, రాజ్ కుమార్ సుబేదార్, ప్యానల్ న్యాయ వాదులు పాల్గొన్నారు. కార్యాక్రమములొ ఇంచార్జి చైర్మన్ యం.నాగరాజు మాట్లాడుతూ న్యాయవాద వృత్తి అత్యంత పవిత్రమైనదని, ఈ శిక్షణ ద్వారా నైపుణ్యత పెంపొందించుకొని ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందించాలని కోరారు. అదనపు జిల్లా న్యాయమూర్తి యం.భవాని, సీనియర్ సివిల్ జడ్జి యం.వెంకటేశ్వర్ రావు లు వృత్తికి నైపుణ్య శిక్షణ అవసరమని క్రొత్త చట్టాలు , మార్పు చెందుతున్న విధి విధానాలను అవగతం చేసుకొని న్యాయవాదులు ఉత్తమ సేవలు ప్రజలకు అందించాలని కోరారు. తదుపరి మాస్టర్ ట్రైనర్స్ శిక్షణను కొనసాగించారు.


