04.09.2021 Nalgonda Dist నల్గొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అధ్యాపకునికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు*

నల్గొండ,సెప్టెంబర్ 4. స్థానిక నల్గొండ పట్టణంలోని  కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అధ్యాపకులు సింగం శ్రీనివాస్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సల్కు నూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్  2002 సంవత్సరంలో జూనియర్ లెక్చరర్ గా ఎంపికై , వనపర్తి, నేరేడుచర్ల, మిర్యాలగూడ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహించి నారు.  లెక్చరర్ గా పని చేస్తూనే, అదనంగా జాతీయ సేవా పథకం (NSS) ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు, శీతాకాల మరియు వేసవి కాల ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం, ఉచిత మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేసినందుకు,NCC ఆఫీసర్ గా విద్యార్థులను జాతీయ సమగ్రత మరియు సమైక్యత కొరకు  తయారుచేయడం మరియు ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ గారి ఆదేశానుసారం కోవిడ్ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మూడు నెలలపాటు ఉచిత పోలీస్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహించడం , లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారి దాతృత్వంతో  ఉచిత అల్పాహారాన్ని అందించడం,కళాశాల అభివృద్ధి కొరకు దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం, హరితహారం ద్వారా మొక్కలను నాటించడం, విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉండి వారి ఉన్నత విద్యలో  మార్గదర్శిగా  సహాయ సహకారాలు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ఉత్తమ జూనియర్ లెక్చర ర్ అవార్డుకు   ఎంపిక చేసింది.  ఈ అవార్డు ద్వారా నాపై మరింత బాధ్యత పెరిగిందని , ఈ అవార్డును నా తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అంకితమిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. అవార్డు రావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ నరేంద్ర కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి dasru నాయక్ మరియు కళాశాల సిబ్బంది విద్యార్థులు హర్షం ప్రకటించారు.[

Share This Post