04.09.2021 Nalgonda Dist *పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన జాయింట్ టాస్క్ పోర్స్ టీమ్*

*పత్రికా ప్రకటన*          *పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన జాయింట్ టాస్క్ పోర్స్ టీమ్*                  నల్గొండ,సెప్టెంబర్ 4.పెట్రోల్ బంక్ ల యజమానులు పెట్రోల్,డీజిల్ వినియోగ దారులకు సరైన కొలతల్లో సరఫరా చేయాలని,కనీస వసతులు త్రాగునీరు, టాయిలెట్స్,ఫ్రీ ఎయిర్ వసతి కల్పించాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ ఆదేశాల ననుసరించి పౌర సరఫరాల శాఖ,ఆయిల్ కంపెనీ ల సేల్స్ అధికారులు,తూనికలు, కొలతలు శాఖ అధికారులతో కూడిన జాయింట్ టాస్క్ ఫోర్స్ టీమ్ నల్గొండ పట్టణం లోని రెండు పెట్రోల్ బంక్ లను తనిఖీ చేశారు.నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్డు లో ఉన్న సాయి రత్న పెట్రోల్ బంక్, కలెక్టరేట్ రోడ్డు లోని శివ సాయి పెట్రోల్ బంక్ లను జాయింట్ టాస్క్ ఫోర్స్ టీమ్ తనిఖీ లు చేశారు.    పెట్రోల్ పంపు మిషన్ లలో ఉన్న పల్సర్లను తనిఖీ చేశారు.అందులో ఎటువంటి చిప్స్ లేవని గుర్తించారు. తదుపరి పెట్రోల్ బంక్ నిల్వలను పరిశీలించి నిల్వలు సరిగా ఉన్నవని,ఎటువంటి వ్యత్యాసం లేదని గుర్తించారు. పెట్రోల్ బంక్ లో కనీస వసతులు టాయిలెట్ లు,త్రాగు నీటి సౌకర్యం, ఉచిత ఎయిర్ మొదలగు వసతులు పరిశీలించారు. శివసాయి  పెట్రోల్ బంక్  సి ఫారం ప్రతి నెల లైసెన్సింగ్ అధికారికి ఇవ్వనందున,కొత్త టాయిలెట్ మూసి వేసి ఉన్నందున పెట్రోల్ బంక్ పై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు..పెట్రోల్ బంక్ ల తనిఖీలు నిరంతరం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు.వినియోగ దారులకు సరైన కొలతలు తో పెట్రోల్,డీజిల్ సరఫరా చేయ వలెనని, కనీస వసతులు టాయిలెట్స్,త్రాగు నీరు,ఉచిత ఎయిర్  సౌకర్యం కల్పించ వలెనని,లేనిచో శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.వెంకటేశ్వర్లు తెలిపారు.జాయింట్ టాస్క్ ఫోర్స్ టీమ్ లో జిల్లా పౌర సరఫరాల అధికారి వి. వెంకటేశ్వర్లు,తూనికలు,కొలతలు శాఖ ఇన్స్పెక్టర్  రామకృష్ణ, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యా నందం,ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సేల్స్ అధికారి యం.నాగేందర్,పౌర సరఫరాల డి.టి.పి.విజయ తదితరులు ఉన్నారు

Share This Post