04.09.2021 Nalgonda Dist యూత్ క్లబ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం

నల్గొండ, సెప్టెంబర్ 4. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ. నెహ్రూ యువ కేంద్ర. నల్లగొండ జిల్లా వారి ఆధ్వర్యంలో స్థానిక  నల్లగొండ పట్టణం TPUS భవన్ నందు యూత్ క్లబ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా.ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ పుల్లారావు గారు మరియు నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి భూక్య ప్రవీణ్ సింగ్. పాల్గొన్నారు. డాక్టర్ పుల్లారావు గారు మాట్లాడుతూ. యువతను ఉద్దేశించి ప్రతి గ్రామంలో యువత సంఘంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు అదే విధంగా గ్రామాభివృద్ధి కి యువత దోహదపడలన్నారు. సామాజిక సేవ కార్యక్రమలు నిర్వహించాలన్నారు. అలాగే అవయవాలు దానం చేయడం పై అవగాహన కల్పించారు. ప్రవీణ్ సింగ్ గారు మాట్లాడుతూ.
ఏ దేశంలోనైన విప్లవాత్మక మార్పు మరియూ అభివృద్ధి కేవలం యువతతోనే సాధ్యం అవుతుందని ఆ దిశగా ప్రతి యొక్క గ్రామీణ యువత నిస్వార్థంగా ప్రజాసేవలో ముందుండాలని అన్నారు. యువత నిస్వార్థంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా తమ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకుంటు,ఆయా గ్రామాల్లోని ప్రజలను చైతన్య పరుస్తూ సమస్యలను గుర్తించి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెల్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి అని అన్నారు. అదే విధంగా  దేశం బాగుండాలంటే యువత ముందుండాలని అభివృధి కార్యక్రమాలలో యువత భాగస్వాములు కావాలని అన్నాడు.
ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర కార్యాలయ సిబ్బంది మేఘవత్ కొండ నాయక్ . జాతీయ అవార్డు గ్రహీత గంజి రాజేందర్. సురేష్ రెడ్డి. నెహ్రు యువ కేంద్ర వలంటీర్లు. సాయి కుమార్ రెడ్డి. లింగ స్వామి. నరేష్. వెంకటరమణ. హేమలత. శ్రీలత. యూత్ సభ్యులు సత్యనారాయణ. వేణు. మహేష్. అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post