05-రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి తెలంగాణా శాసన మండలి సభ్యుని ఎన్నికకు జిల్లా ఎన్నికల అధికారి మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మంగళవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

05-రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి తెలంగాణా శాసన మండలి సభ్యుని ఎన్నికకు జిల్లా ఎన్నికల అధికారి మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మంగళవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

ఇట్టి ఎన్నికకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని కలెక్టరేట్లు, ఆర్.డి.ఓ. కార్యాలయాలు, తహశీల్ధార్, మండల పరిషత్ కార్యాలయాలు, మునిసిపాలిటీలలో నోటీసు బోర్డులపై ప్రదర్శించవలసినదిగా సంబంధిత అధికారులకు సూచించారు.
(మంగళవారం) నేటి నుండి ప్రభుత్వ సెలవు దినాలైన 19, 21 మినహా ఈ నెల 23 వరకు నామినేషన్లు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.

నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ లేదా సహాయ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ నుండి నిర్దేశించిన సమయంలో పొంది అట్టి పత్రాలను ఎన్నికల అధికారి లేదా సహాయ ఎన్నికల అధికారి ఛాంబర్ లో అభ్యర్థి గాని, అతని ప్రతిపాదికునిచే గాని అందజేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

ఇట్టి నామినేషన్ పత్రాలను ఈ నెల 24న పరిశీలిస్తామని, నామినేషన్ ఉపసంహరించుకునే అభ్యర్థులు ఈ నెల 26న మధ్యాన్నం 3 గంటల లోగా నోటీసును ఎన్నికల అధికారి లేదా సహాయ ఎన్నికల అధికారికి అభ్యర్థి లేదా అతని ప్రతిపాదకునిచే అందజేయాలని అన్నారు.

పోలింగు డిసెంబర్ 10 న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి అమోయ్ కుమార్ తెలిపారు. కాగా మంగళ వారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని కలెక్టర్ తెలిపారు.

Share This Post