(05.06.2022) ముందరి తండా, పామిరెడ్డి పల్లె, కంద్రియ తాండా, కాశిం నగర్, నాగమ్మ తాండా గ్రామాలలోని నర్సరీల తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్

పత్రికా ప్రకటన
తేది:05.06.2022, వనపర్తి.

హరితహారం లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఆదివారం వనపర్తి జిల్లాలోని ముందరి తండా, పామిరెడ్డి పల్లె గ్రామాలలోని నర్సరీలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. నర్సరీలలో పెంచిన మొక్కలను పరిశీలించి, మొక్కలకు ప్రతి రోజు నీరు అందించాలని ఆమె సూచించారు. హరితహారం కార్యక్రమానికి మొక్కలు సరఫరా చేసేలా సిద్ధంగా ఉంచాలని ఆమె తెలిపారు. మొక్కల మధ్యలో ఉన్న కలుపు మొక్కలు తొలగించాలని, ఒక క్రమ పద్ధతిలో మొక్కలను ఏర్పాటు చేయాలన్నారు. మొక్కలు ఎండిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని నిర్వాహకులకు ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా, జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ మొక్కలు నాటి, నీరు అందించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యంతో కృషి చేయాలని ఆమె సూచించారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వన్ కంద్రియ తాండా, కాశిం నగర్, నాగమ్మ తండ ప్రాంతాలలోని వైకుంఠధామాలను, నర్సరీలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీల సంరక్షణ పట్టాలని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఖాళీ స్థలాలలో మొక్కలు నాటాలని, వైకుంఠ దామా లలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆశిష్ సం గ్వాన్, (రెవెన్యూ) డి వేణుగోపాల్, డీఈవో రవీందర్, అధికారులు, గ్రామ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
……….
ప్రతి నెల నిర్వహించే సాధారణ తనిఖీలో భాగంగా తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో గల ఈ.వి. ఎం.  గోదామును జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదివారం తనిఖీ చేశారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post