06-09-2021 Nalgonda Dist *మొక్కల సంరక్షణ పట్ల శ్రద్ధ వహించాలి;జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*

నకిరేకల్,శాలిగౌరారం, సెప్టెంబర్ 6. NH 365 హైవే ఇరువైపులా నాటిన  మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం  నకిరేకల్,శాలి గౌరారం మండలంలలో వివిధ గ్రామ పంచాయతీల పరిధి లో NH 365 రహదారి ఇరువైపులా నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు.నకిరేకల్ మండలం చందం పల్లి,కడపర్తి,నెల్లి బండ గ్రామ పంచాయతీ లలో NH 365 ఇరువైపులా నాటిన మొక్కలు పరిశీలించి సంరక్షణ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.చందం పల్లి ప్లై ఓవర్ పక్కన ఖాళీ స్థలం లో అభివృద్ధి పరచిన పల్లె ప్రకృతి వనం ను కలెక్టర్ పరిశీలించారు.చిన్న మొక్కల స్థానం లో పెద్ద మొక్కలు నాటాలని సూచించారు.

శాలిగౌరారం మండలం జాతీయ రహదారి 365 ఇరు వైపులా పెర్కకొండారం,మాధవరం కలాన్,వంగ మర్తి జి.పి. ల పరిధి లో మొక్కలు పరిశీలించారు. ఎండి పోయిన మొక్కల స్థానం లో కొత్త మొక్కలు నాటాలని,మొక్కల సంరక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.పాదులు తీసి యూరియా ఎరువు పట్టించాలని,మొక్కల సంరక్షణ పట్ల అశ్రద్ధ వహించ వద్దని అధికారులను ఆదేశించారు.నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్,ఎం.పి.డి.ఓ.లు,ఎం. పి.ఓ.లు,గ్రామ అధికారులు ఉన్నారు.

Share This Post