07.08.2021 పత్రికా ప్రకటన* *మొక్కల సంరక్షణ కు చర్యలు తీసుకోవాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*

నల్గొండ,ఆగస్ట్ 7.హరిత హారం లో భాగంగా రహదారుల కిరువైపులా నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు శనివారం జిల్లా కలెక్టర్ నల్గొండ అద్దంకి  బైపాస్ నామ్ రహదారి లో అనిశెట్టి దుప్పల్లి నుండి మర్రిగూడ బైపాస్ వరకు రహదారి ఇరువైపులా మొక్కలు పరిశీలించారు. మొక్కల సంరక్షణ లో  నిర్లక్ష్యం వహించ వద్దని, ఎండిపోయిన  మొక్కలు స్థానం లో మొక్కలు మూడు వరుసలుగా మరల నాటాలని, పడిపోయిన  మొక్కలకు సపోర్టుగా మంచి ఎత్తయిన కర్రలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మొక్క చుట్టూ పాదులు తీయాలని మొక్కలకు, వాటరింగ్ చేయాలని, లేనిచో రావలసిన బిల్లు కూడా  ఆపేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ డి.ఈ. అశోక్,మండల అధికారులు పాల్గొన్నారు.

Share This Post