07.08.2021 *పత్రికా ప్రకటన* *రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం:రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి*

#నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం లో రైతు వేదిక భవనాలు ప్రారంభం చేసిన మంత్రి.     మిర్యాలగూడ, ఆగస్ట్ 7.రైతు సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి అన్నారు.శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్                       నిరంజన్ రెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేశారు.వేముల పల్లి మండలం లో రైతు వేదిక భవనం ప్రారంభించారు.కస్తూర్భా బాలికల పాఠశాల భవనం కు శంఖుస్థాపన చేశారు.వేముల పల్లి మండలం శెట్టి పాలెం లో, మిర్యాలగూడ మండలం తుంగ పహాడ్, దామరచర్ల మండలం కొండప్రోల్,దామరచర్ల రైతు వేదిక భవనాలు ప్రారంభించారు.మిర్యాలగూడ పట్టణం లో భూసార పరీక్ష భవనం ప్రారంభం చేశారు. మిర్యాలగూడ లో రైతు వేదిక భవనం ప్రారంభం చేశారు. దామరచర్ల, మిర్యాలగూడ లో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం లో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతోందని అన్నారు.2018 ఆగస్ట్ మాసంలో రైతు బంధు అమలు  చదుస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినపుడు విపక్షాలు ఎన్నికల కోసం ప్రకటించినట్లు,అమలు అవుతుందా అని విమర్శించారని, కానీ 7 విడతలుగా రైతు బంధు చెల్లించినట్లు,43 వేల 36 కోట్ల రూ.లు ఎకరానికి 10 వేల రూ.లు  చొప్పున చెల్లించినట్లు ఆయన వెల్లడించారు.రైతు అకాల మరణం సంభవిస్తే రైతు భీమా కింద 5 లక్షల రూ.లు చెల్లిస్తున్నట్లు                             రైతు భీమా దేశంలో అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే రైతు ల తరపున ఎల్. ఐ. సి.కి  ప్రీమియం చెల్లిస్తున్నట్లు తెలిపారు.5 సం. ల కాలం లో 57 వేల 599 కుటుంబాలు లబ్ది పొందినట్లు తెలిపారు.  రైతు కు భరోసా కల్పించడానికి రైతు భీమా ఉపయోగ పడుతుందని అన్నారు.60 శాతం ఉన్న రైతులు, రైతు కూలీలను సంఘటిత పరచి  రైతు ఉత్పత్తులకు మార్కెటింగ్,ప్రపంచ,దేశం లో డిమాండ్ ఉన్న పంటలకు అనుసంధానం కల్పించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ముందుచూపుతో రైతు బంధు సమితులు ఏర్పాటు చేసినట్లు  తెలిపారు.ప్రపంచం లో, దేశంలో వ్యవసాయ రంగం లో నూతన ఆవిష్కరణలు,వ్యవసాయ పద్ధతులు,పరిజ్ఞానం, సమాచారం రైతు వేదికల ద్వారా రైతులకు శిక్షణ కార్యక్రమాలు,అవగాహన కు రైతు వేదికలు దోహదపడుతాయని అన్నారు.కె.సి.ఆర్.పరిపాలన ఉన్నంత వరకు రైతులకు ఎటువంటి చింత లేదని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన 2014 లో రాష్ట్రం లో వ్యవసాయ స్థూల ఉత్పత్తులు గణాంక శాఖ లెక్కల ప్రకారం విలువ 40 వేల కోట్లు కాగా,గత సంవత్సరం యాసంగి,వానా కాలం లో వ్యవసాయ స్థూల ఉత్పత్తులు విలువ 3 లక్షల 96 వేల కోట్లు అని,పదింతలు పెరిగి నట్లు వెల్లడించారు. ప్రాజెక్ట్లు పూర్తి అయితే ఇంకా పెరుగుతుందని అన్నారు.వరి దాన్యం లో పంజాబ్ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణ గా 50 సంవత్సరాలు గా ఉందని, పంజాబ్ రాష్ట్రం 2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిస్తే, తెలంగాణ రాష్ట్రం 3 కోట్ల మేట్రిక్ టన్నుల వరి పండించి తెలంగాణ రాష్ట్రం అగ్ర స్తానం లో నిలిచిందని అన్నారు.భవిష్యత్తు లో రైతులకు వ్యవసాయ మార్కెటింగ్ ఉత్పత్తులకు ఇబ్బందులు లేకుండా  సంఘటితం గా ధర నిర్ణయం చేసేందుకు రితుబందు సమితులు,రైతు వేదికలు నిర్మాణం చేసినట్లు తెలిపారు.60 లక్షల 84 వేల మందికి  రైతు బంధు మొన్నటి సీజన్ లో ఇచ్జినట్లు తెలిపారు.వ్యవసాయ రంగం 2 కోట్ల 48 లక్షల పై చిలుకు కుటుంబాలు ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తున్నట్లు,ఐ. టి.రంగం లో 6 లక్జల 50 వేల మందికి, నూతన పారిశ్రామిక రంగం లో 10 లక్షల 50 వేల మందికి,ప్రైవేట్ రంగం లో అనేక మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు.నూటికి నూరు శాతం రైతులు పందించిన పంటలు కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని,బి.జె. పి.పాలిత 20 రాష్ట్రాల్లో  గుజరాత్,ఇతర రాష్ట్రాల్లో రైతు ఉత్పత్తులకు మద్దతు ధర చెల్లించారా అని అన్నారు.24 గంటలు ఉచిత కరెంట్,రైతు బంధు అందిస్తున్నట్లు,ఉత్తర ప్రదేశ్ లో 5 లక్షల 50 వేలు కరెంట్ మోటార్ లు ఉంటే,30 లక్ష ల ఆయిల్ ఇంజన్ లు రైతులు డీజిల్ భరిస్తే,తెలంగాణ లో 30 లక్షల కరెంట్ మోటార్ లకు ప్రభుత్వం ఉచిత కరెంట్ సరఫరా చేస్తోందని అన్నారు.కె.సి.ఆర్.మంచి పనులు చేస్తుంటే ప్రతి పక్షాలకు తిట్టడమే పని అన్నారు.పట్టా పొందిన రైతులు  పి.ఓ.బి,ధరణి పార్ట్ బి కింద ఉందని, వారికి ధరణి లో ఎంటర్ చేసేలా ముఖ్యమంత్రి డ్రస్5 తీసుకు వెళ్లి రైతు బంధు వర్తించేలా కృషి చేస్తానని అన్నారు.6 లక్షల 68 వేల 811  మంది రైతులకు 50 వేల లోపు ఉన్న వారికి రుణ మాఫీ అమలు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మిర్యాలగూడ శాసన సభ్యులు ఎన్. భాస్కర్ రావు,వ్యవసాయ శాఖ జె.డి.శ్రీధర్ రెడ్డి, ఉద్యాన శాఖ డి.డి.సంగీత లక్ష్మీ,,జిల్లా రైతు బంధు అధ్యక్షులు రాం చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.  జిల్లా పౌర సంభంధాల అధికారి నల్గొండ గారిచే జారి

Share This Post