07.08.2021 పత్రికా ప్రకటన* *రైస్ మిల్లర్లు సి.యం.ఆర్ బియ్యం త్వరితగతిన పూర్తి చేయాలి:అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్*

నల్గొండ, ఆగస్ట్ 7.రైస్ మిల్లర్లు సి.యం.ఆర్ బియ్యం త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మిల్లర్ లను కోరారు.శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల డి.టి.లు,ఆర్.ఐ. లు,ఎం.ఎల్.ఎస్.పాయింట్ ఇంచార్జి లు,స్టేజ్ 2 కాంట్రాక్టర్ల తో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించి వివిధ అంశాలను సమీక్షించారు.ఎం.ఎల్.ఎస్.పాయింట్ ఇంచార్జి లు పి.డి.ఎస్ బియ్యం రవాణా గోదాం ల నుండి చౌక ధర దుకాణాలకు  10 వ తేదీ వరకు రవాణా పూర్తి చేయాలని అన్నారు.ఎఫ్.పి.షాప్ డీలర్ లనుండి  ప్రతి నెల గన్నీ లు సేకరణ చేయాలని,తహశీల్దార్ కార్యాలయం లో విజిలెన్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి కార్డు దారుడు చౌక ధర దుకాణం నుండి బియ్యం 15 వ తేదీ వరకు తీసుకొనవలెనని అన్నారు.డీలర్ లు రేషన్ దుకాణాలు నిర్దేశించిన సమయం లో తెరచి ఉంచాలని అన్నారు.ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా పౌర సరఫరాల డి.యం.నాగేశ్వరరావు, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం తదితరులు పాల్గొన్నారు

Share This Post